సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. లేడి ఓరియెంట్ చిత్రాల్లో దక్షిణాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం 24 రోజుల బాక్సాఫీస్ జర్నీలో 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది. ఇంకా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నది. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజ్ నిడిమోరు నిర్మాతగా మారి రూపొందించారు. ఈ చిత్రం గత 25 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తోపాటు యాక్షన్ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ మేలవింపుతో రూపొందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 29 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ ద్వారా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ మూవీని ట్రాలాలా బ్యానర్ సొంతంగా రిలీజ్ చేసింది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ ప్రాఫిట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో మా ఇంటి బంగారం చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి వారం 34 కోట్ల రూపాయలు, రెండో వారం 21 కోట్ల రూపాయలు, మూడో వారం 6 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రాలో 24.5 కోట్ల రూపాయలు, తెలంగాణలో 32.5 కోట్ల రూపాయలు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో 57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగేతర రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ చిత్రం కర్ణాటకలో 13 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, ఇతర ప్రాంతాల్లో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం 77 కోట్లకుపైగా కలెక్షన్లను ఇండియాలో సాధించింది. సౌత్ ఇండియాలో 2026 సంవత్సరంలో అత్యధిక వసూళ్లను సాధించిన 8వ చిత్రంగా తెలుగులో 4వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమాను భారతీయ ప్రేక్షకులు భారీగా ఆదరించడంతో అత్యధిక వసూళ్లను నమోదు చేసింది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్లకుపైగా కలెక్షన్లును, ఇతర దేశాల్లో కలిపి 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 24 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 101 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు, ట్రాలాలా బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. సమంత నటించిన ఈ చిత్రం సుమారుగా 47 కోట్ల రూపాయల షేర్ థియేట్రికల్‌గానే వసూలు చేసింది. నాన్ థియేట్రికల్ పరంగా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 29 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిస్తే.. ఈ చిత్రం 82 కోట్ల రూపాయల రెవెన్యూను సంపాదించి పెట్టింది. ఈ సంవత్సరం భారీ లాభాలను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది అని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.More Articles