అమెరికన్ సూపర్ నేచురల్ సైకాలజికల్ హారర్ మూవీ అబ్సెషన్ (Obsession) రిలీజై భారీ వసూళ్లను సాధించడమే కాకుండా సగటు ప్రేక్షకులను, క్రిటిక్స్, సినీ వర్గాలను ఆకట్టుకొంటున్నది. మైఖేల్ జాన్సస్టన్, ఇందే నవరెట్టే, కూపర్ టోమిలిన్‌సన్, మేఘన లాలెస్, ఆండీ రిచర్, కర్రీ బార్కర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. జేమ్స్ హారిస్, హ్యాలీ నికోల్ జాన్సన్ తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు.
సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: టైలర్ క్లెమాన్స్, ఎడిటింగ్: కర్రీ బార్కర్ మ్యూజిక్: రాక్ బుర్వెల్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం మే 15వ తేదీన ఇండియాలోను, అలాగే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
హరర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను మొత్తంగా 750000 డాలర్ల బడ్జెట్‌తో అంటే.. సుమారుగా భారతీయ కరెన్సీలో 7 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషన్స్ పరంగా కూడా పెద్దగా హడావిడి చేయలేదు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో ఆడియెన్స్ పొందిన అనుభూతిత మౌత్ టాక్ భారీగా స్పెడ్ అయింది. దాంతో రెండో వారం నుంచి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊపందుకొన్నది. దాంతో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఇండియాలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలివారం ఈ సినిమా 19 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. తొలివారం టాక్ పెరగడంతో రెండోవారంలో 31 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు రాబట్టింది. మూడో వారంలో స్టడీగా వసూళ్లను సాధిస్తూ 22 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక నాలుగో వారంలో కూడా 8 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఐదో వారంలో 3.5 కోట్లు, ఆరో వారంలో 1 కోటి రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయల నెట్, 100 కోట్ల రూపాయలకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా నార్త్ అమెరికాలో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. భారీ బడ్జెట్, ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు నిర్మించిన సినిమాలను కూడా వెనక్కి నెట్టింది. అమెరికా, కెనడాలో ఈ సినిమా ఇప్పటి వరకు 245 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 2337.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం రానున్న రోజుల్లో 250 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక అమెరికేతర దేశాల్లో కూడా బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులిపింది. ఈ చిత్రం యూకేలో 22 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌లో 10 మిలియన్ డాలర్లు, యూఏఈలో 6 మిలియన్ డాలర్లు, జర్మనీలో 3 మిలియన్ డాలర్లు, టర్కీలో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం నార్త్ అమెరికాను మినహాయించి మొత్తంగా 158 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 1500 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్‌గ 3800 కోట్ల రూపాయలను వసూలు చేసి సంచలన రికార్డును క్రియేట్ చేసింది. ఇంకా ఓవర్సీస్, నార్త్ అమెరికాలో నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది.More Articles