మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ జర్నీని ముగించింది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటించిన విషయం తెలిసిందే.
కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెకన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
స్పోర్ట్స్, రూరల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా భారీగా నిర్మించారు. రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమా బడ్జెట్ 350 కోట్ల రూపాయతో రూపొందించారు. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారానికి వస్తే.. ఈ చిత్రం ఏపీ, నైజాం ఏరియాల వారీగా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 136 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 140 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. పెద్ది చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా భారీ వసూళ్లతో కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం తొలివారం 176 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. రెండొ వారం 230 కోట్ల రూపాయల నెట్, మూడో వారం 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగో వారం ఈ సినిమా 4.5 కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లను వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. దాంతో ఈ చిత్రం 220 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది అని తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాల వసూళ్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 55 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 23 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 21 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 13 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 9.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 13 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 10.5 కోట్ల రూపాయలు, నెల్లూరులో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 150 కోట్ల రూపాయల షేర్, 235 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పెద్ది చిత్రం ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో అంతగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్ల దుమ్ము దులిపింది.ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పోల్చుకొంటే.. 15 కోట్ల రూపాయల మేర లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలో మినహాయించి దాదాపు రిలీజైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.More Articles