విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ రావు బహదూర్. పీరియాడికల్, సైకిలాజికల్ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో దీపా థోమస్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూలై 3న వరల్డ్ వైడ్‌గా రావు బహదూర్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, సత్యదేవ్ క్రేజ్ కారణంగా అడ్వాన్స్ బుకింగ్‌లో రావు బహదూర్ మూవీ జోరు చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు పరిశీలిస్తే..

Advertisement

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాకు అండగా నిలిచారు. ఆయన ఆధ్వర్యంలోని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సమర్పణలో ఏ+ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణా రెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్‌లు రావు బహదూర్ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

రావు బహదూర్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రావు బహదూర్ మూవీకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. గ్రాఫిక్స్‌తో పాటు నాటి కాలానికి సంబంధించిన సెట్స్ కోసం భారీగా ఖర్చుపెట్టినట్లుగా టీజర్, ట్రైలర్‌లు చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాపై తొలి నుంచి ఉన్న హైప్ నేపథ్యంలో రావు బహదూర్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ పరంగా మంచి బిజినెస్‌ను సొంతం చేసుకుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

రావు బహదూర్ బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
రావు బహదూర్ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇక మ్యూజిక్, శాటిలైట్, ఇతర రైట్స్ ద్వారా మరో 5 కోట్ల రూపాయలు వసూలు కావడంతో మొత్తంగా రావు బహదూర్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 12 కోట్ల రూపాయలుగా లెక్కకట్టారు. సత్యదేవ్ మూవీని నిర్మాతలు, జీఎంబీ సంస్థలు సొంతంగా విడుదల చేస్తున్నాయి. ఈ మేరకు కమీషన్ బేసిస్ మీద డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే రావు బహదూర్ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Advertisement

రావు బహదూర్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్
సత్యదేవ్ సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో రావ్ బహదూర్ మూవీకి అమెరికాలో ప్రీమియర్స్‌కు ఊహించని స్పందన లభిస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం బట్టి అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ చూస్తే.. అక్కడ ఇప్పటికే రావు బహదూర్ మూవీ 100K డాలర్లు (దాదాపు 95 లక్షల రూపాయలు) రాబట్టినట్లు నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా ప్రకటించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్ ఇండియా లెవల్‌లో ఇప్పటి వరకు 33 వేలకు పైగా టికెట్స్ అమ్ముడై 47 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్‌లోనే రావు బహదూర్ మూవీ 1.50 కోట్ల రూపాయలు రాబట్టింది. సత్యదేవ్ జోరు చూస్తుంటే ఫస్ట్ 4 నుంచి 5 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి రావు బహదూర్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.