వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్, దీపా థోమస్ జంటగా నటించిన మూవీ రావు బహదూర్. వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఏ+ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణా రెడ్డి, ఈశ్వరన్ విజయ రాఘవన్‌లు రావు బహదూర్ మూవీని తెరకెక్కించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. స్మరణ్ సాయి సంగీతం అందించారు. వెంకటేష్ మహా.. దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 3న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో రావు బహదూర్‌కు ఓవర్సీస్‌లో తొలిరోజు ఎంత వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement

రావు బహదూర్ బడ్జెట్ ఎంత?
రావు బహదూర్ మూవీని 40 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కించారు. రావు బహదూర్ మూవీని తెలుగు రాష్ట్రాలు, భారత్, ఓవర్సీస్‌లో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు విడుదల చేస్తున్నారు. నార్త్ అమెరికాతో పాటు ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి సంస్థ రావు బహదూర్‌కు పంపిణీదారుగా వ్యవహరిస్తోంది. సత్యదేవ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ 25 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Advertisement

రావు బహదూర్ తొలిరోజు కలెక్షన్స్
రావు బహదూర్ మూవీకి ఇండియాలో తొలిరోజున 1.40 కోట్ల రూపాయల నెట్.. 1.61 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. తొలిరోజున తెలంగాణలో 91 లక్షల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 66 లక్షల రూపాయలు, కర్ణాటకలో 15.50 లక్షల రూపాయలు, తమిళనాడులో 2 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

రావు బహదూర్ ఓవర్సీస్ కలెక్షన్స్
రావు బహదూర్ మూవీకి తెలుగు రాష్ట్రాలను మించి నార్త్ అమెరికాలో ఎక్కువ క్రేజ్ నెలకొంది. ప్రీమియర్స్‌కు బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికా వ్యాప్తంగా 167 సెంటర్స్‌లో ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా.. 254 షోలకు గాను 3793 టికెట్లు అమ్ముడై 55,829 డాలర్లు (53.32 లక్షల రూపాయలు) వసూలు చేశాడు సత్యదేవ్. ప్రీమియర్స్ + డే1 కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 200K డాలర్లు (భారత కరెన్సీలో 1.90 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో కలిపి ఓవర్సీస్‌లో రావు బహదూర్‌ తొలిరోజున 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి ఉండొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో భారత్‌లో వచ్చిన కలెక్షన్స్‌తో కలిపి సత్యదేవ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా తొలిరోజున 3.70 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి.

Advertisement

ఓవర్సీస్‌లో రావు బహదూర్ మూవీకి ఆదరణ నేపథ్యంలో ఈ వీకెండ్‌లో సత్యదేవ్ మూవీకి మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. మా ఇంటి బంగారం, నాగబంధం తదితర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా రావు బహదూర్ ఓవర్సీస్‌లో ఈ స్థాయి రెస్పాన్స్‌కి విశ్లేషకులు ఆశ్చర్యపడుతున్నారు. నార్త్ అమెరికాలో ఇదే జోరు కొనసాగి.. తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు పుంజుకుంటే మాత్రం సత్యదేవ్‌ను ఎవరూ ఆపలేరని ఆయన అభిమానులు చెబుతున్నారు.