అమెరికన్ సూపర్ హీరో ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న మరో స్పైడర్ మ్యాన్ చిత్రం స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (Spider-Man: Brand New Day). స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో ఇది నాలుగోది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకు డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. స్టాన్ లీ, స్టీవ్ డిటికో రచించిన స్పైడర్ మ్యాన్ పుస్తకం ఆదారంగా ఈ చిత్రాన్ని కెవిన్ ఫీజ్, ఆమీ పాస్కల్, అవి అరద్ నిర్మించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, జెండ్ా, సాదీ సింక్, జాకబ్ బాటాలాన్, జాన్ బెర్నథాల్ తదితరులు నటించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: బ్రెట్ పావ్లాక్, ఎఢిటింగ్: నాట్ సాండర్స్, జినా సన్సామ్, మ్యూజిక్: మైఖేల్ జియాచినో తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. మార్వెల్ స్టూడియోస్. పాస్కల్ పిక్చర్స్, సోని భాగస్వామ్యంలో ఈ చిత్రం జూలై 30వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు ఇండియాలో భారీగా స్పందన కనిపిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేరళ, కర్ణాటక, నైజాంలో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న ఈ ఫ్రాంచైజీని భారతీయ ప్రేక్షకులకు అందించేందుకు భారీగా ప్లాన్ చేశారు. ఇంగ్లీష్‌లో రూపొందిన ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోకి డబ్బింగ్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ, 3డీ, 4డీఎక్స్, ఎంఎక్స్ 4డీ 3డీ తదితర వెర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు కేరళలో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఈ చిత్రం ఇప్పటికే 65 వేల టికెట్లను అమ్మడం జరిగింది. దాంతో ఈ చిత్రం ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక కర్ణాటక రాష్ట్రంలోను స్పైడర్ మ్యాన్ హవా కొనసాగుతున్నది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వ్యక్తమవుతున్నది. బెంగళూరులో రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఇంకా ఐదు రోజులు ఉండగానే.. ఈ సినిమా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు నైజాంలో కూడా క్రేజ్ భారీగా ఉండటంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇక నార్త్ ఇండియాలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగా కనిపిస్తున్నది. నేషల్ ఛైన్స్ థియేటర్లైన పీవీఆర్, సినిపోలీస్ తదితర స్క్రీన్లలో టికెట్ల అమ్మకాలు ఊపందుకొన్నాయి. పీవీఆర్‌లో ఈ చిత్రం 1.5 లక్షల టికెట్లు అమ్ముడు కాగా, సినీ పోలీస్‌లో 50 వేల టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే సుమారుగా 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 60 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తొలి రోజు 1500 కోట్లకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.More Articles