పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ హీరోగా యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ స్పిరిట్. టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో స్పిరిట్ కూడా ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా తన మార్క్ చూపించిన సందీప్.. ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడోనని డార్లింగ్ అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై స్పిరిట్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన యానిమల్ ఫేమ్ త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. స్పిరిట్‌కు హర్షవర్థన్ రామేశ్వర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. 2027 మార్చి 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రభాస్, త్రిప్తి దిమ్రీ లుక్ తప్పించి కొత్తగా ఏ పోస్టర్ కానీ, న్యూస్ కానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు సందీప్.

స్పిరిట్ మూవీ షూటింగ్ హైదరాబాద్ నగర పరిసరాల్లో జరుగుతోంది. డిసెంబర్ నాటికి వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభించాలని సందీప్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే సినిమా విడుదల డీలే అవుతుందన్న వార్తలను ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో ఖండించారు. తాము ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సినిమా శరవేగంగా చిత్రీకరిస్తున్నాం, ఇప్పటి వరకు 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

ఇక ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. తన రెండు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో ఎన్నో విలక్షణ పాత్రలు, మాస్‌ను ఊపేసే గెటప్స్‌ను ఆయన పోషించారు. అయితే ప్రభాస్‌ను పోలీస్ యూనిఫాంలో చూడాలని కోట్లాదిమంది అభిమానులు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు. తాజాగా స్పిరిట్‌తో వీరందరీ ఆశలు తీర్చేందుకు సిద్ధమవుతున్నారు డార్లింగ్. యాక్షన్, మాస్, కమర్షియల్ హంగులతో అభిమానులు కోరుకున్న విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.

Advertisement

ఇదిలాఉండగా.. స్పిరిట్ సెట్స్ మీద ఉండగానే ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ క్రేజ్, సందీప్ రెడ్డి వంగా టేకింగ్ కారణంగా చిత్ర పరిశ్రమలో స్పిరిట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బడా సంస్థలు క్యూకడుతున్నాయి. తాజాగా స్పిరిట్ బిజినెస్‌కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో స్పిరిట్ థియేట్రికల్ రైట్స్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మైత్రీ మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తెలుగుతో పాటు కర్ణాటక హక్కులను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే స్పిరిట్‌కు 200 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, హిందీ, ఓవర్సీస్ రైట్స్‌తో కలిపి ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా మూవీకి వరల్డ్ వైడ్‌గా 400 నుంచి 500 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.