హాలీవుడ్‌ పాపులర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, ఫాంటసీ చిత్రం ది ఒడిస్సీ. ఈతాకా గ్రీక్ సమ్రాజ్యాధినేత ఒడిస్సీ జీవితంలో జరిగిన కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని ట్రోజాన్ వార్ తర్వాత చోటు చేసుకొన్న సంఘటలన నేపథ్యంగా ఈ సినిమాను రూపొందించారు. ఒడిస్సీగా మాట్ డామన్, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే నటించారు. ఈ చిత్రంలో టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ నటించారు. ఈ సినిమాను ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ నిర్మించారు.

Advertisement

ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: హోయతే వాన్ హోయ్‌తేమ, ఎడిటర్: జెన్నిఫర్ లామే, మ్యూజిక్: లడ్‌విగ్ గోరాన్సన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. యూనివర్సల్ పిక్చర్స్ , సింకోపి బ్యానర్లపై రూపొందించిన ఈ చిత్రం ఇండియాలో, ఇతర దేశాల్లో జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ చిత్రం ఓపెన్సింగ్ ఎలా ఉండబోతున్నాయి? తొలి రోజు ఎంత వసూలు చేస్తుందనే వివరాల్లోకి వెళితే..

Advertisement

ది ఒడిస్సీ సినిమాను మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందించారు. ఈ సినిమాను ఊహకు అందని విధంగా టెక్నికల్ అంశాలు, కంటెంట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాను సుమారుగా 2400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. నోలన్ సినిమాలపై ఉన్న క్రేజ్ భారీగా ఉండటంతో రికార్డు స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ఒడిస్సీ సినిమాను నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ కంట్రీస్, కొరియా, జపాన్, చైనా దేశాలతోపాటు మొత్తంగా 73 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సుమారుగా 23000 స్క్రీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. నోలన్ రూపొందించిన ఒపెన్‌హైమర్ సినిమాను సుమారుగా 17 వేల స్క్రీన్ల ప్రదర్శించారు.ఈ సినిమాకు భారీగా హైప్ ఉండటంతో రికార్డుస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

తాజా ట్రేడ్ అంచనాల ప్రకారం.. నార్త్ అమెరికాలో ఈ సినిమాకు భారీ ఆదరణ కనిపిస్తున్నది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిల జరుగుతున్నది. ఈ సినిమా తొలి వారాంతం అంటే.. మొదటి మూడు రోజుల్లో 100 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది. భారతీయ కరెన్సీలో 960 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఇక ఇతర దేశాల్లో ఈ సినిమా 110 మిలియన్ డాలర్లు అంటే 1050 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. మొత్తంగా ఈ సినిమా 210 నుంచి 220 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే ఈ సినిమా తొలి మూడు రోజుల్లో 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే.. ఈ రేంజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

Advertisement

ఇండియాలో కూడా ఈ సినిమాకు భారీ ఒపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఈ సినిమాను తొలి రోజు 3 వేల షోలు ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. దాదాపు 9 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వసూళ్లు నమోదు అయ్యాయి. తొలి రోజు ఈ సినిమా 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.