హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, బీజీఎం, హైటెక్నికల్ స్టాండర్డ్స్‌తో కథను చెప్పడం ఆయన స్టైల్. నోలన్ గతంలో తీసిన ది డార్క్ నైట్, ఇంటర్‌స్టెల్లర్, ఓపెన్ హైమర్ తదితర చిత్రాలు ఆయనను హాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా మార్చడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టాయి. అలాంటి దర్శక దిగ్గజం నుంచి వచ్చిన మూవీ ది ఒడిస్సీ.

Advertisement
Advertisement

సెట్స్‌పై ఉన్నప్పటి నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్‌కు నెల ముందు నుంచే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. గ్రీకు పురాణాలు, చారిత్రక అంశాల ఆధారంగా తెరకెక్కించిన ది ఒడిస్సీ మూవీని జూలై 18న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలిరోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ విజువల్ వండర్.. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు రాబట్టింది? భారత్‌లో వసూళ్లు ఎంత అనేది పరిశీలిస్తే..

ది ఒడిస్సీలో మాట్ డామన్, అన్నె హత్‌వే, టామ్ హాలెండ్, రాబర్ట్ పాటిన్‌సన్, సమంత మార్టన్, జెండ్యా, చార్లీజ్ థెరాన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. యూనివర్సల్ పిక్చర్స్, సింకోపి బ్యానర్లపై ఎమ్మా థోమస్, క్రిస్టోఫర్ నోలన్‌లు సంయుక్తంగా నిర్మించారు. ది ఒడిస్సీకి హోటే వాన్ హోటేమా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జెన్నీఫర్ లామ్ ఎడిటర్‌గా, లూడ్విగ్ గోరాన్‌సన్‌ సంగీతం అందించారు.

Advertisement

ది ఒడిస్సీ బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి ది ఒడిస్సీ మూవీని 250 మిలియన్ డాలర్లు (2400 కోట్ల రూపాయలు) భారీ బడ్జెత్‌తో తెరకెక్కించినట్లుగా హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిస్టోఫర్ నోలన్ మూవీకి ప్రీమియర్స్‌లో నార్త్ అమెరికా వ్యాప్తంగా 17.6 మిలియన్ డాలర్లు (169 కోట్ల రూపాయలు) వసూలైంది. ప్రీమియర్స్ + డే 1 కలిపి ది ఒడిస్సీకి నార్త్ అమెరికాలో 50 మిలియన్ డాలర్లకు పైగా (481 కోట్ల రూపాయలు) రాబట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే ది ఒడిస్సీ మూవీ తొలి వీకెండ్‌లో అమెరికాలో 117 మిలియన్ డాలర్లు (1126 కోట్ల రూపాయలు).. వరల్డ్ వైడ్‌గా 200 మిలియన్ డాలర్లు (1925 కోట్ల రూపాయలు) వసూలు చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

భారత్‌లో ది ఒడిస్సీ కలెక్షన్స్
ఇండియాలో తొలిరోజు ది ఒడిస్సీ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున ఈ సినిమాకు 8413 షోలు ప్రదర్శితమయ్యాయి. భారత్‌లో 17.4 కోట్ల రూపాయల నికర వసూళ్లు.. 20.76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసింది. ఇంగ్లీష్ వెర్షన్‌లో 5.51 కోట్ల రూపాయలు, హిందీ వెర్షన్‌లో 60 లక్షల రూపాయలు, తెలుగు వెర్షన్‌లో 28 లక్షల రూపాయలు, తమిళ్ వెర్షన్‌లో 20 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది. మహారాష్ట్రలో 4 కోట్ల రూపాయలు, ఢిల్లీలో 2.86 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 3.53 కోట్ల రూపాయలు, తెలంగాణలో 2.43 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్‌లో 1.10 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.85 కోట్ల రూపాయలు, కేరళలో 1.32 కోట్ల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

Advertisement

భారత్‌లో రెండో రోజు వసూళ్ల అంచనా
ది ఒడిస్సీకి రెండో రోజు భారత్‌లో భారీ బుకింగ్స్ జరుగుతున్నాయి. పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌కు తోడు వీకెండ్ కలిసి రావడంతో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఆధరణ లభిస్తోంది. శనివారం ఈ సినిమాకు భారత్‌లో ఇప్పటి వరకు 4817 షోలు ప్రదర్శితమై 50 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఢిల్లీలో 479 షోలు, బెంగళూరులో 426 షోలు, ముంబైలో 393 షోలు, హైదరాబాద్‌లో 286 షోలు ప్రదర్శితమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ది ఒడిస్సీ మూవీ భారత్‌లో రెండో రోజున 8.27 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్లు సాక్‌నిక్ పేర్కొంది. శనివారం క్రిస్టోఫర్ నోలన్ మూవీకి భారత్‌లో 25 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఊపు చూస్తంటే ఫస్ట్ వీకెండ్‌లోనే ఇండియాలో 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రెండో రోజు ది ఒడిస్సీ వరల్డ్ వైడ్‌గా 80 మిలియన్ డాలర్లు (770 కోట్ల రూపాయలు) రాబట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.