సినిమా పరిశ్రమలో అఫైర్, బ్రేకప్, సహజీవనం లాంటి వార్త నిత్యం మీడియాలో దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే కొన్ని చూసి చూడనట్టు వదిలేసేలా ఉంటే.. కొన్ని సంచలనకరమైన వార్తలుగా మారుతుంటాయి. కొన్ని బ్రేకప్ వార్తలు అభిమానులకు షాకింగ్ కలిగిస్తుంటాయి. అలాంటి షాకింగ్ కలిగించే బ్రేకప్ వార్తకు సంబంధించిన రూమర్లు, గాసిప్స్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువ హీరో,హీరోయిన్ల మధ్య కొంత కాలంగా నడుస్తున్న ప్రేమాయణానికి బ్రేక్ పండింది. కానీ వారి మధ్య అభిప్రాయాలు తారాస్థాయికి చేరుకోవడం వల్ల వీడిపోక తప్పలేదు. అయితే వారి మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ఈ గొడవకు కారణం ఏమిటంటే?

Advertisement

తమిళ సినిమా రంగంలో యువ హీరో, దక్షిణాదిలో టాలెంటెడ్ హీరోయిన్ ఈ మధ్య ఓ సినిమాలో నటించడం ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారు. వారి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్లుగా ఇద్దరు డేటింగ్ చేస్తూన్నారనే వార్తలు మీడియాలో హైప్ అయ్యాయి. అయితే వారిద్దరూ ఎక్కడా కూడా వారి రిలేషన్‌షిప్ గురించి నోరు విప్పలేదు. అయితే కొన్నాళ్లుగా చాటుమాటుగా వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు.

Advertisement

అయితే ఇటీవల కాలంలో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా మీడియాలో హల్‌చల్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టుండి వారి లవ్, డేటింగ్ లైఫ్‌కు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎండ్ కార్డు పడింది. అందుకు కారణం హీరో వ్యవహరించిన తీరు వల్లే ఇదంతా జరిగిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

అయితే సదరు హీరో గురించి సినీ వర్గాల్లో నడుస్తున్న భారీ చర్చ ప్రకారం.. యువ హీరోయిన్‌పై హీరో కమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపేలా నిర్ణయాలు చేయడం, అలాగే ప్రొఫెషనల్ జీవితంలోకి చొరబడి ఆమెను డిక్టేట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తన ప్రియుడి జోక్యాన్ని భరించలేక తన నిర్ణయాలు తానే తీసుకోవడం, తనకు నచ్చిన విధంగా ఉండటంతో వారి మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి అని వారి సన్నిహితులు, స్నేహితుల నుంచి బయటకు సమాచారం పొక్కింది.

Advertisement

దాంతో సదరు హీరోపై పూర్తిస్థాయిలో అసంతృప్తితో ఉన్న హీరోయిన్ కొద్దికాలంగా దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఇటీవల చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఇద్దరు గొడవ పడ్డారు. అయితే మాట మాట పెరిగిపోవడం, ఒకరిపై ఒకరు శారీరక దాడి పాల్పడటం వెళ్లింది. ఓ దశలో సదరు హీరోయిన్ హీరోను చెప్పుతో కొట్టిందనే వార్తలు కూడా మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అక్కడే ఈ గొడవంతా చూసిన వారు ఈ వివాదంపై పెదవి విప్పడం లేదని తెలిసింది.

ఈ వార్త ఓ వైపు సోషల్ మీడియాలో చెలరేగుతుంటే.. అనుపమ పరమేశ్వరన్ చేసిన ఇన్స్‌టాగ్రామ్ పోస్టు చర్చనీయాంశమైంది. జీవితంలో తనకు స్వేచ్ఛ లభించింది అంటూ ఆమె చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. చెన్నైలో లీలా ప్యాలెస్ హోటల్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగిన గొడవలోకి అనుపమ పరమేశ్వరన్ లాగుతున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చెబితే గానీ వాస్తవం బయటకు రాదు అని సినీ వర్గాలు అంటున్నాయి.