మెగా హీరోలలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న ఒక్కొక్కరు సోలో లైఫ్‌కు వీడ్కోలు పలికి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్‌తో నైనిక రెడ్డి వివాహం జరిగింది. ఇక మిగిలింది చిరంజీవి మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు మాత్రమే. వీరిద్దరూ ఇంకా బ్యాచిలర్స్‌గానే ఉన్నారు. దాంతో వీరు ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారు? అనేది ఆసక్తిగా మారింది. తాజాగా ఈ అన్నదమ్ముల్లో వైష్ణవ్ తేజ్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఉప్పెన సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని రికార్డ్ సృష్టించాడు ఈ కుర్రాడు. ఆ తర్వాత కొండ పొలం, రంగ రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలలో నటించాడు. 2023 తర్వాత మూడేళ్లుగా ఈ కుర్రాడి నుంచి ఎలాంటి సినిమా రాకపోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ హీరోయిన్ ఎవరో కాదు పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ.
ప్రేమ ఇష్క్ కాదల్ మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టారు రీతూ వర్మ.. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు, కేశవ, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, స్వాగ్, మజాకా సినిమాలలో నటించారు రీతూ వర్మ. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా వస్తోన్న మూవీలో ఆయన సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే గతంలో విక్రమ్ సరసన నటించిన ధ్రువనక్షత్రం మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. కాగా.. వరుణ్ తేజ్‌తో రీతూ వర్మ రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఎలాంటి సినిమాలోనూ నటించకుండానే వీరి ప్రేమాయణం ఎప్పుడు? ఎక్కడ మొదలైంది? అనేది ఆసక్తికరంగా మారింది. తొలుత వీరిద్దరి బంధంపై వచ్చిన ఊహాగానాలను పుకార్లుగా అందరూ కొట్టిపడేశారు. అయితే లావణ్య - వరుణ్ తేజ్ పెళ్లిలో రీతూ వర్మ సందడి చేయడం.. మెగా కుటుంబంలో జరిగే కొన్ని కార్యక్రమాలకు హాజరుకావడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారన్న వార్తలకు బలం చేకూరింది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ ఊహాగానాలపై స్పందించారు వైష్ణవ్ తేజ్. రీతూ వర్మ నాకు మంచి స్నేహితురాలు.. అంతకుమించి ఏం లేదని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు.. ఎక్కడా రీతూ - వైష్ణవ్‌ల ప్రస్తావన రాలేదు. ఇదే సమయంలో బ్రేకప్ జరిగిందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే అలాంటిదేమీ లేదని రీతూ వర్మతో వైష్ణవ్ తేజ్ రిలేషన్ కొనసాగుతోందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ తమ బంధాన్ని మీడియాకు దూరంగా గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారట. ఇటీవల తాను కొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించినట్లు రీతూ వర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీనికి అందరికంటే ముందుగానే లైక్ చేశాడట వైష్ణవ్. ఇది కాస్త చర్చనీయాంశం కావడంతో రీతూ వర్మ- వైష్ణవ్ తేజ్‌ల రిలేషన్ మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనిని బట్టి వీరిద్దరూ రిలేషన్‌లోనే ఉన్నారని, తమ బంధాన్ని సీక్రెట్‌గా సాగిస్తున్నారని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి నిజంగానే వైష్ణవ్ తేజ్- రీతూ వర్మలు ప్రేమించుకుంటున్నారా? వీరిద్దరి రిలేషన్ నిజమేనా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.More Articles