స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ అందాల భామ.. తన సహజ నటనతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటుంది. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో డేటింగ్, పెళ్లి వార్తలు వైరల్ కాగా.. ఇప్పుడు మరోసారి 24 ఏళ్ల టీమిండియా యువ క్రికెటర్‌తో‌ ఆమె పేరు జతకట్టారు. ముంబైలోని ఓ కేఫేలో జంటగా కనిపించడంతో డేటింగ్ రూమర్లు మొదలయ్యాయి. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరు?

Advertisement
Advertisement

మృణాల్ ఠాకూర్‌కు ఇలాంటి డేటింగ్ రూమర్స్ కొత్తవి కావు. గతంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలను ధనుష్‌కు సన్నిహిత వర్గాలు, మృణాల్ టీమ్ పూర్తిగా ఖండించాయి. అంతకుముందు కూడా టీవీ నటుడు శరద్ త్రిపాఠి, అర్జిత్ తనేజా, కుశాల్ టాండన్, ర్యాపర్ బాద్‌షా, సిద్ధాంత్ చతుర్వేది, క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌లతో కూడా మృణాల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఆ ప్రచారాల్లో ఒక్కటీ అధికారికంగా నిజమని తేలలేదు.

Advertisement

తాజాగా మృణాల్ ఠాకూర్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలువురు హీరోలతో ఆమె పేరు జతకట్టిన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ప్రచారానికి కారణం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న 'బూజీ కేఫే'వద్ద వైరల్ అయిన ఒక వీడియో. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అభిమానులు, నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

వైరల్ వీడియోలో 33 ఏళ్ల మృణాల్ ఠాకూర్ కేఫేలోపల కనిపిస్తుండగా, 24 ఏళ్ల యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తూ కనిపించాడు. ఆ తర్వాత కారులో వెళ్లిపోయాడు. అయితే వీడియోలో ఇద్దరూ కలిసి నడవడం లేదు. కలిసి కూర్చోవడం లేదు. ఒకే ఫ్రేమ్‌లో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా కనిపించలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఇద్దరూ ఒకే కేఫేలో కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పోస్టులు కూడా పెట్టడం ప్రారంభించారు. అయితే మరోవైపు చాలామంది నెటిజన్లు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వీడియోలో ఇద్దరూ ఒకే ప్రదేశంలో కనిపించడం మాత్రమే జరిగిందని గుర్తు చేస్తున్నారు. దానిని బట్టి ప్రేమలో ఉన్నారని చెప్పడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

మరో అంశం కూడా సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. మృణాల్ ఠాకూర్‌కు ప్రస్తుతం 33 ఏళ్లు. యశస్వి జైస్వాల్‌కు 24 ఏళ్లు. వీరిద్దరి మధ్య సుమారు 9 ఏళ్ల వయసు తేడా ఉందని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని సరదాగా ట్రోల్ చేస్తుండగా, మరికొందరు వయసుతో సంబంధం లేకుండా వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఈ ప్రచారంపై మృణాల్ ఠాకూర్ స్పందించలేదు. యశస్వి జైస్వాల్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement