స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'సీతారామం'సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న, డెకాయిట్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ బ్యూటీ కేవలం తన సినిమాలతోనే కాదు.. వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ప్రస్తుతం తన సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్, పెళ్లి రూమర్స్‌తో హాట్ టాపిక్ గా మారుతోంది. నిన్నటి వరకు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో డేటింగ్ అంటూ రూమర్స్ తో వార్తలతో నిలిచిన మృణాల్ ఠాకూర్ తాజాగా టీమిండియా క్రికెటర్‌తో ఆమె పేరు లింక్ చేస్తున్నారు. దీంతో మరోసారి మృణాల్ సోషల్ మీడియాలో హైలెట్ గా మారింది.

Advertisement
Advertisement

వాస్తవానికి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో ఊహాగానాలు రావడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా సినీ తారలు, క్రికెటర్లకు సంబంధించిన చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియా వైరల్ గా మారుతుంది. వారు ఎవరితోనైనా కలిసి ఉంటే లేదా చనువుగా కలిసి ఉంటే చాలు.. డేటింగ్ రూమర్స్‌ తెరపైకి వస్తునే ఉంటాయి. అలా ప్రస్తుతం మృణాల్ ఠాకూర్- రిషభ్ పంత్ వ్యవహారంలో కూడా అదే జరుగుతోంది. క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు రూమార్స్ క్రియేట్ అవుతున్నాయి. దీనిని ప్రధాన కారణం.. గత కొద్ది రోజులుగా రిషభ్ పంత్, మృణాల్ ఠాకూర్ ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నారు.

Advertisement

ఈ చిన్న విషయం ఆధారంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వీరిద్దర్ని లింక్ చేస్తూ.. కొన్ని సోషల్ మీడియా పోస్టులు ప్రచారం అవుతున్నాయి. అంతేకాదు.. వీరిద్దరి వయసుపై కూడా చర్చ జరుగుతోంది. రిషభ్ పంత్ ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో ఉండగా, మృణాల్ ఠాకూర్ వయసు 33 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపు ఐదేళ్ల వయసు తేడా ఉంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సచిన్ టెండూల్కర్-అంజలి జంటను ఉదాహరణగా చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటివరకు మృణాల్ గానీ, రిషభ్ పంత్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

వాస్తవానికి మృణాల్‌కు డేటింగ్ రూమార్స్ కొత్తేమి కాదు.. ఆమె వ్యక్తిగత జీవితంపై తరుచు రూమర్లు వస్తూనే ఉన్నాయి. టీవీ రంగంలో ఉన్నప్పటి నుంచే రుమార్స్ వస్తునే ఉన్నాయి. మొదట్లో టీవీ నటుడు శరద్ త్రిపాఠితో ఆమె డేటింగ్ చేస్తోందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇద్దరూ కలిసి తరచూ మీడియా కంటబడటంతో ఆ వార్తలకు బలం చేకూరినా.. ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఆ తర్వాత నటుడు అర్జిత్ తనేజాతో మృణాల్ పేరు జతకట్టారు. కానీ, అవి పుకార్లు మాత్రమేనని తెలిపోయాయి.

Advertisement

ఇక సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా మృణాల్ చుట్టూ ఇలాంటి వార్తలు ఆగలేదు. మొదట నటుడు కుశాల్ టాండన్‌తో, ఆ తరువాత ర్యాపర్ బాద్‌షాతో కూడా మృణాల్ పేరు వినిపించింది. ఇక 'సీతారామం' సినిమా సమయంలో నటుడు సుమంత్‌తో డేటింగ్ రూమర్స్ వచ్చాయి. కానీ అవి కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అలాగే బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి సినిమా చేస్తున్న సమయంలో కూడా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ కథనాలు వచ్చాయి. కొంతకాలం క్రితం టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో కూడా మృణాల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Advertisement

ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం సాగుతోందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలపై కూడా ఇద్దరూ స్పందించలేదు. దీంతో ఆ ప్రచారం నిజమా? కాదా? అనేది ఎప్పటికీ స్పష్టత రాలేదు. కానీ, ఆ ప్రచారం కూడా కొద్ది రోజులకే చల్లారిపోయింది. ఇప్పుడు అదే తరహాలో రిషభ్ పంత్‌తో ఆమె పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.