ఎన్టీఆర్ బయోపిక్‌లో కొడుకుతోపాటు కేసీఆర్.. ప్రముఖ నటుడితో..


KCR Role In NTR's Biopic

తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహానటుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన కుమారుడు, సినీ హీరో బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం శరవేగంగా రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రాన్ని భావితరాల గుండెల్లో నిలిపే చిత్రంగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. అవేమిటంటే..

ఎన్టీఆర్ బయోపిక్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా కీలకంగా రూపొందిస్తున్నారట. ఎన్టీఆర్‌తో కేసీఆర్ అనుబంధం ప్రత్యేకమైనవి. టీడీపీ శ్రేణులకు రాజకీయాలు బోధించిన సత్తా ఉన్న నేత కేసీఆర్. ఎన్టీఆర్‌పై ప్రేమకు చిహ్నంగా తన కుమారుడికి ఆయన పేరే పెట్టుకొన్నారు. అలాంటి వ్యక్తి పాత్ర ఈ సినిమాలో లేకుంటే వెలితి అని భావించారట.

ఎన్టీఆర్ బయోపిక్‌లో ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ను కలుసుకొన్న సీన్‌ ద్వారా కేసీఆర్‌ను చూపిస్తున్నారట. తన కుమారుడు కేటీఆర్‌ను వెంట తీసుకొని వెళ్లే సీన్‌ను చిత్రీకరించనున్నారట. అయితే కేసీఆర్ పాత్రకు ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసినట్టు, ఆ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచినట్టు తెలుస్తున్నది.

తాజాగా అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఏఎన్నాఆర్‌గా కనిపించబోతున్నాడు. తన పాత్ర గురించి, మొదటి రోజు షూట్ గురించి సుమంత్ ఆసక్తికరంగా వెల్లడించారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌ కోసం మా తాతగారు చివరి కారులో డ్రైవింగ్ చేసుకొంటూ వెళ్లాను. నేను మా తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించడం చాలా సంతోషంగా ఉంది అని సుమంత్ ట్వీట్ చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రంలో విద్యాబాలన్, రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మహానటి, శాతకర్ణి ఫేం బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి బాలకృష్ణతోపాటు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Read More About: ntr biopic kcr sumanth balakrishna

Have a great day!
Read more...

English Summary

NTR Biopic shooting going with brisk pace. Report suggest that KCR roles is an important aspect in the movie. So popular artist is going to potray as KCR.