పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, పాలనాపరమైన బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, సుపరిపాలనే లక్ష్యంగా ఆయన సాగుతున్నారు. అయితే తనను తెర మీద చూడాలుకునే అభిమానుల కోసం సినిమాలు చేయాలని కూడా పవన్ భావిస్తున్నారు. తన బాధ్యతలకు ఆటంకం కలగకుండా తక్కువ కాల్షీట్స్‌తో వచ్చే వారికి ఖచ్చితంగా అవకాశం ఇస్తానని పవన్ కళ్యాణ్ ఇప్పటికే అవకాశం ఇచ్చారు.

Advertisement
Advertisement

ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. వాటిలో ఒకటి సుజీత్ దర్శకత్వంలో ఓజీ కాగా.. రెండోది సురేందర్ రెడ్డి సినిమా. గతేడాది వచ్చిన ఓజీ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పవన్‌ను అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో అలా చూపించి మెమొరబుల్ హిట్ అందించారు సుజీత్. ఆ సమయంలోనే ఓజీ యూనివర్స్ కొనసాగుతుందని, దానిలో తాను భాగమవుతానని ప్రకటించారు పవన్ కళ్యాణ్.

ఆ తర్వాత రాజకీయాలు, పాలనతో బిజీ అయ్యారు. అయితే ఊహించని విధంగా ఓజీ 2 ప్రాజెక్ట్‌పై కదలిక ప్రారంభమైంది. విదేశాల నుంచి వచ్చిన సుజీత్.. పవన్‌కు కథ చెప్పారు. దీనికి అవసరమైన మార్పులు చేర్పులను సూచించిన పవర్‌స్టార్.. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌తో కలవమని భరోసా ఇచ్చారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే దసరా నాటికి ఓజీ 2 సెట్స్ మీదకి వెళ్తుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే అసలైన ట్విస్ట్ దాగుంది. నిజానికి ఓజీ 2 కంటే ముందే మరో స్టైర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ సినిమాను అనౌన్స్ చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ కోసం కోసం పవన్ బాగా గడ్డం పెంచి, లుక్ విషయంలో మేకోవర్ అయ్యారు. పవన్‌ను స్టైలీష్‌గా చూపించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ స్క్రిప్ట్ వర్క్‌ను స్టార్ రైటర్ వక్కంతం వంశీకి అప్పగించి ఏ విషయంలోనూ రాజీపడకుండా చూసుకుంటున్నారు సురేందర్ రెడ్డి. అఖిల్ అక్కినేనితో తీసిన ఏజెంట్ డిజాస్టర్ కావడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు సురేందర్ రెడ్డి.

Advertisement

సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఓజీ 2 ప్రాజెక్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా ఉండటం, ఏడాది గడిచినా సురేందర్ రెడ్డితో మూవీ గురించి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ప్రస్తుతానికి ఈ సినిమాను పవర్‌స్టార్ హోల్డ్‌లో పెట్టేశారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. వంశీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో దానిని పూర్తి స్థాయిలో డెవలప్ చేయాల్సిందిగా పవన్ కోరారట. దాంతో సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ ఆయన టీమ్ కొన్ని నెలల పాటు పనిచేసి స్క్రిప్ట్‌ను రూపొందించి పవన్‌కు వినిపించగా ఇది పవర్‌స్టార్‌ను ఆకట్టుకోకపోవడంతో ప్రాజెక్ట్‌పై అనిశ్చితి ఏర్పడినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారని.. సురేందర్ రెడ్డి- వంశీలు రూపొందించే మరో వెర్షన్ కూడా పవన్‌ను మెప్పించలేకపోతే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు అభిమానులు కూడా ఓజీ 2 కోసమే ఉత్కంఠగా ఎదురుచూస్తుండటం కూడా పవన్ కళ్యాణ్‌ను ఆలోచనలో పడేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిస్ధితుల మధ్య పవన్ కళ్యాణ్ - సురేందర్ రెడ్డి సినిమా భవితవ్యం ప్రమాదంలో పడింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అన్న దానిపై ఫుల్ క్లారిటీ రావాలంటే... సురేందర్ రెడ్డి లేదా పవన్ కళ్యాణ్ టీమ్ స్పందించాల్సిందే.