టాలీవుడ్‌లో వరుస సక్సెస్‌తో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాయదు లోహర్, బాలీవుడ్ నటుడు రాఘవ జుయల్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల రచన సహకారంతోపాటు దర్వకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Advertisement

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మ్యూజిక్: అనిరుధ్, సినిమాటోగ్రఫి: సీహెచ్ సాయి, ఎడిటర్: నవీన్ నూలీ, ప్రొడక్షన్ డిజైనర్: అవినాస్ కోల్ల, డైలాగ్స్: తోట శ్రీనివాస్, క్యాస్టూమ్ డిజైనర్: అజయ్ కుమార్, సౌండ్ డిజైన్: సురేన్ జీ, అలగైకూతన్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను వాస్తవానికి మార్చి 26 రిలీజ్ చేయాలని భావించారు. కానీ సాంకేతిక పనుల ఆలస్యం కారణంగా ఈ మూవీని సెప్టెంబర్ 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లకు సంబంధించిన వార్త ఒకటి ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Advertisement

తల్లి, కొడుకుల బంధం నేపథ్యంగా రూపొందుతున్న ఎమోషనల్ కథా చిత్రాన్ని సికింద్రాబాద్‌లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. 60వ దశకంలో ఓ గిరిజన తెగ హక్కుల కోసం పోరాటం, ఆ తెగ నుంచి ఓ అనాథ ఓ నాయకుడిగా అవతరించడం ఈ స్టోరీలోని మెయిన్ పాయింట్. భావోద్వేగాలతో సాగే ఈ సినిమాకు భారీగా కమర్షియల్ హంగులు అద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఇటీవల సంప్రదించారనే వార్త వైరల్ అయింది.

Advertisement

అయితే కొద్ది రోజులుగా పూజా హెగ్డేను స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించగా అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. ఆమెతో కంటెంట్, రెమ్యునరేషన్ విషయాలు కూడా చర్చించారు. కానీ ఆమె ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటం కారణంగా షూటింగ్‌కు అందుబాటులో లేకపోయింది. అయితే ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనే సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. దాంతో పూజా హెగ్డే అందుబాటులో లేకపోవడం వల్ల మరో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆ క్రమంలో కీర్తీ సురేష్‌ను సంప్రదించగా అందుకు ఆమె ఒప్పుకొన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Advertisement

గతంలో నానితో కీర్తీ సురేష్‌ కలిసి రెండు, మూడు సినిమాల్లో నటించారు. నేచురల్ స్టార్‌తో ఉన్న రిలేషన్‌తో ఈ పాటను చేయడానికి ముందుకు వచ్చారు. సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారే ఈ పాటలో మెరిసేందుకు రెడీ అవుతున్నారనే వార్త ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతున్నది. అయితే నానీ, కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ మరోసారి మెప్పిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో పూజా హెగ్డే ఈ అవకాశాన్ని వదులుకోవడం ద్వారా క్రేజీ ఆఫర్ కీర్తీ సురేష్ దక్కించుకొన్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇక ఈ సినిమా కోసం అనిరుధ్ అందించిన పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆయా షేర్ పాట ఇప్పటికే రికార్డు వ్యూస్‌తో సంచలనం రేపింది. పూజా హెగ్డే వదులుకొన్న ఈ పాట మరిన్ని సంచనాలు క్రియేట్ చేస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.