Fauzi OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవెడైట్ మూవీ 'ఫౌజీ'ఒకటి. 'సీతారామం'తో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్, ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ బిజినెస్ గురించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
'ఫౌజీ' సాధారణ కమర్షియల్ సినిమా కాదు. 1930ల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం కాలంలోని సంఘటనల ప్రభావం, దేశభక్తి, యాక్షన్, భావోద్వేగాలు, స్పై థ్రిల్లర్ అంశాలను మేళవిస్తూ కథను హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా సంకేతాలు లభించాయి.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త హీరోయిన్ ఇమాన్వీ నటిస్తుండగా, ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం 'ఫౌజీ' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫౌజీ విడుదలకు ముందు ఓటీటీ హక్కులు, థియేట్రికల్ డీల్స్ గురించి ఆసక్తిని పెంచుతున్నాయి. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..'ఫౌజీ' సౌత్ ఇండియన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.180 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. అయితే, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ గానీ, నెట్‌ఫ్లిక్స్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఓటీటీ డీల్‌తో పాటు హిందీ మార్కెట్‌లో కూడా 'ఫౌజీ'పై భారీ డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిల్మ్స్ (AA Films) ఈ సినిమా హిందీ థియేట్రికల్ హక్కులను రూ.60 కోట్లకు పైగా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియా మార్కెట్‌లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్, హను రాఘవపూడి కథపై ఉన్న నమ్మకంతో ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక హిందీ డిజిటల్ హక్కుల డీల్ మాత్రం ఇంకా ఖరారు కాలేదని సమాచారం. అలాగే శాటిలైట్, ఆడియో హక్కుల విక్రయం కూడా మిగిలి ఉంది. అవి కూడా భారీ ధరకు అమ్ముడైతే 'ఫౌజీ' రిలీజ్‌కు ముందే వందల కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న రూ.180 కోట్ల నెట్‌ఫ్లిక్స్ డీల్, రూ.60 కోట్ల హిందీ థియేట్రికల్ డీల్ వంటి వివరాలపై అధికారిక ధృవీకరణ రాలేదు. అందువల్ల మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వీటిని ట్రేడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారంగానే చూడాలి. ఒకవేళ ఈ డీల్స్ నిజమైతే.. ఫౌజీ విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో మరో భారీ రికార్డు సృష్టించే ప్రభాస్ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.More Articles