సూపర్ స్టార్ రజినీకాంత్.. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న నటుడు.. సాధారణ కండక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించినా ఆయన నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తనదైన స్టైల్, మేనరిజమ్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు. 75 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. తాజాగా రజనీకాంత్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సంగతేంటీ?

Advertisement
Advertisement

రజనీకాంత్ తన సినీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సోషల్ మీడియా ప్రచారం ప్రకారం.. ప్రస్తుతం 173వ'ధర్మన్' సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్ మరో రెండు సినిమాలు పూర్తి చేసి, 175వ సినిమాతో తన సినీ ప్రయాణానికి ముగింపు పలకాలని భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. రజనీకాంత్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ, మేనేజ్‌మెంట్ టీమ్ గానీ, నిర్మాణ సంస్థల గానీ ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement

అయితే ఈ ప్రచారాన్ని పరిశీలిస్తే.. ఇది కొత్త విషయం కాదనే విషయం స్పష్టమవుతుంది. గతంలో 'బాబా','కాళా','కూలీ'సినిమా సమయంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. రజనీకాంత్ సినిమాలకు వీడ్కోలు పలుకుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరించారు. అందువల్ల ఈసారి కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంగానే చూడాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

ప్రస్తుతం రజనీకాంత్ తన 173వ చిత్రం'ధర్మన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించగా భారీ రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు జైలర్ 2 విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తదుపరి ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పలువురు దర్శకులతో ఆయన చర్చలు జరుపుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో రిటైర్మెంట్ వార్తలకు మరింత అనుమానం వ్యక్తమవుతోంది.

మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న '175వ సినిమాతో రజనీకాంత్ రిటైర్మెంట్'వార్తకు అధికారిక ఆధారాలు లేవు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది కేవలం ఇదోక రూమర్ మాత్రమే.. రజనీకాంత్ తన భవిష్యత్ సినీ ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.. దానిని ఆయనే లేదా ఆయన బృందమే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇవ్వన్నీ పుకార్లు మాత్రమేనని భావించాలి.

Advertisement

మరోవైపు.. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కూడా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కొనసాగాలని నిర్ణయించుకుని, తన చివరి సినిమాగా 'జననాయకన్'ను ప్రకటించారు. దీంతో కోలీవుడ్‌లో మరో అగ్ర నటుడు కూడా త్వరలోనే రిటైర్ అవుతారనే ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఒకవేళ రజనీకాంత్ కూడా అదే నిర్ణయం తీసుకుంటే.. తమిళ సినీ పరిశ్రమలో ఒక యుగానికి ముగింపు పలికినట్లేనని అభిమానులు సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.