టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు అస్సలు టైం బాగున్నట్లుగా కనిపించడం లేదు. తను నటించిన సినిమాలు డిజాస్టర్స్‌గా అవుతుండటంతో పాటు కొన్ని సినిమాల నుంచి తనే తప్పుకోవడం లేదా తప్పించడం జరుగుతోంది. తాజాగా ఓ స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత? నిజంగానే శ్రీలీలను తప్పించారా? ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? అంటే టక్కున వినిపించే పేరు శ్రీలీల. అందం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ.. చాలా చిన్న వయసులోనే మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ వంటి అగ్రనటుల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. సినిమా సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి బొక్కబోర్లా పడుతున్నప్పటికీ శ్రీలీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. అంతలా అదృష్టం ఆమెను కాపాడుతోంది. సీనియర్ హీరోల నుంచి అప్‌కమింగ్ హీరోల వరకు ఫస్ట్ ఛాయిస్ శ్రీలీలే అన్నట్లుగా పరిస్ధితి మారింది.

Advertisement

అయితే గత కొంతకాలంగా శ్రీలీలకు పరిస్ధితులు తారుమారు అవుతున్నాయి. స్టార్ హీరోలు, ఇతర క్రేజీ ప్రాజెక్ట్‌లలో హీరోయిన్‌గా ఎంపిక కావడం తర్వాత తప్పుకోవడం లేదా దర్శక నిర్మాతలే తొలగించడం షరా మామూలే అన్నట్లుగా మారుతోంది. ఇటీవల విడుదలైన అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీలో తొలుత శ్రీలీలనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కొన్ని సీన్లు కూడా షూట్ చేసి పోస్టర్స్ సైతం వదిలారు. కానీ ఊహించని విధంగా శ్రీలీలను ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ తప్పించారు. ఆమె ప్లేస్‌లో మరో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

Advertisement

తల్లి మీతిమీరిన జోక్యం, డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్లే శ్రీలీలను లెనిన్ నుంచి తప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. వీటికి ఇటీవల లెనిన్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెక్ పెట్టారు. క్రియేటివ్ డిస్కషన్స్ కారణంగా మా వైపు నుంచి ఆలస్యమైంది.. శ్రీలీల ఇచ్చిన డేట్స్‌కి షూటింగ్ నిర్వహించలేకపోయాం. ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్, పరాశక్తి సినిమాలలో శ్రీలీల ఎంపికయ్యారు. రెండు పెద్ద సినిమాలకు ఒకేసారి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక శ్రీలీల ఇబ్బంది పడ్డారు. తనను డిస్ట్రబ్ చేయడం ఇష్టం చేయలేక ఆమె స్థానంలో భాగ్యశ్రీని తీసుకున్నామని నాగవంశీ స్పష్టం చేశారు.

Advertisement

ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమపై ఫోకస్ పెట్టింది శ్రీలీల. పరాశక్తి మూవీతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కానీ శ్రీలీలకు లక్ మామూలుగా లేదు.. ఆ వెంటనే స్టార్ హీరో ధనుష్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇక బాటలో కోలీవుడ్ అగ్రనటుడు అజిత్ కుమార్‌కు హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కినట్లుగా వార్తలు వచ్చాయి. దాంతో తమిళంలో బలంగా జెండా పాతినట్లేనని శ్రీలీల సంబరాలు చేసుకుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను ఆగస్ట్‌లో సెట్స్ మీదకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు.

Advertisement

అయితే ఊహించని విధంగా అజిత్ సరసన హీరోయిన్‌గా శ్రీలీలను తప్పించి మరో హీరోయిన్‌ని తీసుకున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాల్షీట్లను సర్దుబాటు చేయలేక శ్రీలీల ఈ ఆఫర్ వదులుకుందా లేక దర్శక నిర్మాతలే ఆమెను తప్పించారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్‌పైనే శ్రీలీల ఆశలు పెట్టుకుంది. ఇలాంటి సమయంలో అజిత్ మూవీ నుంచి ఆమె తప్పుకోవడం పెద్ద దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు.