సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళను అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోని స్టార్ కపుల్స్‌లో ఈ జంట కూడా ఒకటి. ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. శోభితతో పెళ్లి తర్వాత తండేల్‌తో హిట్ కొట్టారు నాగచైతన్య. బుజ్జితల్లి తన జీవితంలోకి రావడంతో పాటు అదృష్టాన్ని కూడా వెంట తీసుకొచ్చిందని భార్యపై ప్రేమను బయటపెట్టారు చైతూ. తాజాగా వీరిద్దరూ జంటగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కి వెళ్లారు. ఈ సందర్భంగా మరోసారి శోభిత గురించి చెబుతూ సిగ్గుపడిపోయారు నాగచైతన్య. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

సమంతతో విడాకుల తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే లైఫ్ లీడ్ చేశారు నాగచైతన్య. అయితే శోభితతో ప్రేమలో పడిన ఆయన సీక్రెట్‌గా తమ బంధాన్ని కంటిన్యూ చేశారు. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని మీడియా కోడై కూసింది. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు. చివరికి నాగచైతన్య - శోభితలు ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో శోభిత- నాగచైతన్యల వివాహం ఘనంగా జరిగింది.

మ్యారేజ్ తర్వాత హనీమూన్‌ కోసం విదేశాలకు వెళ్లొచ్చారు నాగచైతన్య - శోభిత. ప్రస్తుతం అక్కినేని వారి కోడలు అన్న హోదాని ఎంజాయ్ చేస్తూ.. అత్తింటి గౌరవానికి ఎక్కడా భంగం కలగకుండా చూసుకుంటున్నారు శోభిత. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తన ఇమేజ్, హోదాకు తగిన స్క్రిప్ట్‌లను ఆమె ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయంలో భర్త నాగచైతన్య ఆమెకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు.

Advertisement

మరోవైపు.. తండేల్‌తో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన నాగచైతన్య ప్రస్తుతం వీరూపక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో వృషకర్మ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా త్వరలోనే విడుదల కానుంది. సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఓపెనింగ్స్‌లో శోభిత, నాగచైతన్యలు దూసుకెళ్తున్నారు.

Advertisement

తాజాగా హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు నాగచైతన్య- శోభితలు హాజరై ప్రారభంభించారు. ఈ సందర్భంగా లోపల ఉన్న చీరలు ఇతర వెరైటీలను చూస్తుండగా అన్నా వదినకి ఏ చీర తీసుకుంటున్నారని అభిమానులు కేకలు వేశారు. దీనికి చైతూ స్పందిస్తూ.. తను ఏది కోరుకుంటే అదే తీసుకుంటానని చెప్పడంతో అంతా నవ్వేశారు. భర్త తన గురించి చెబుతుంటే శోభిత సిగ్గుతో ముసిముసి నవ్వులు చిందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

శోభిత- నాగచైతన్యలు గుడ్‌న్యూస్ ఎప్పుడు చెబుతారా అని అక్కినేని కుటుంబ సభ్యులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. శోభిత గర్భం దాల్చారంటూ పలు ఊహాగానాలు వినిపించగా.. వాటిని ఇద్దరూ ఖండించారు. ఏమైనా ఉంటే తామే అధికారికంగా చెబుతామని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు.. అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ లెనిన్ ఘన విజయం సాధించడంతో అక్కినేని ఫ్యామిలీ సంబరాలు జరుపుకుంటోంది. 11 ఏళ్ల తర్వాత తమ్ముడు హిట్ కొట్టడంతో నాగచైతన్య కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే చైతూ చీఫ్ గెస్ట్‌గా లెనిన్ సక్సెస్ మీట్ నిర్వహించే యోచనలో చిత్ర యూనిట్ ఉందని టాలీవుడ్ టాక్.