కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు మరాఠీ ముద్దుగుమ్మ. ఆమె ఎదురుచూపులు ఫలించి లెనిన్ మూవీతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు భాగ్యశ్రీ. అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిశోర్ దర్శకత్వంలో వచ్చిన లెనిన్ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. లెనిన్ హిట్‌తో సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్‌లో ఆమెకు మరిన్ని అవకాశాలు క్యూ కట్టనున్నాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలు, కెరీర్ ప్లాన్స్‌పై భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సేకు ఆ మూవీ షాకిచ్చింది. ఆ వెంటనే కింగ్డమ్, కాంతా, ఆంధ్ర కింగ్ తాలూకా వంటి సినిమాలలో ఆమె నటించారు. ఇవన్నీ కూడా స్టార్ హీరో సినిమాలే అయినా భాగ్యశ్రీకి విజయాన్ని అందించలేకపోయాయి. సెంటిమెంట్స్ మీద నడిచే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమెపై ఐరన్ లెగ్ ముద్రపడింది. హీరోయిన్‌గా కెరీర్ ముగిసిపోయిందనుకున్న దశలో అనూహ్యంగా లెనిన్‌లో భాగ్యశ్రీకి అవకాశం దక్కింది. తొలుత ఈ రోల్‌కి శ్రీలీలను ఎంపిక చేశారు మేకర్స్.. అయితే అనివార్య కారణాలతో శ్రీలీల తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు.
లెనిన్‌లో ఆమె పోషించిన భాగ్యశ్రీ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందం, నటనతో పాటు తెలుగువారు సైతం ఇబ్బందిపడే అన్న ఎన్టీఆర్ దానవీర శూరకర్ణలోని ఫేమస్ డైలాగ్‌ను గుక్కతిప్పుకోకుండా చెప్పి అలరించింది భాగ్యశ్రీ. దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో ఉంటున్నా తెలుగు నేర్చుకోని చాలామంది హీరోయిన్లకు భాగ్యశ్రీ స్పూర్తిగా నిలిచారు. లెనిన్ హిట్‌తో భాగ్యశ్రీ రేంజ్ మారిపోయింది. తన తదుపరి సినిమాలకు 2 కోట్లకు పైనే ఆమె రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేస్తున్నారట. టాలెంట్, అందం, యువతలో క్రేజ్ దృష్ట్యా భాగ్యశ్రీ ఎంత అడిగినా ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అందరు హీరోయిన్ల మాదిరిగానే భాగ్యశ్రీ బోర్సే పైనా రకరకాల రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా యంగ్ హీరో రామ్ పోతినేనితో ఆమె రిలేషన్‌లో ఉన్నారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. రామ్‌పై భాగ్యశ్రీ పలుమార్లు ప్రశంసలు కురిపించడం, అలాగే హైదరాబాద్ తన కర్మభూమి అని.. చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఏదో ఒకరోజున వీరిద్దరూ గుడ్‌న్యూస్ చెబుతారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాంటిది భాగ్యశ్రీ తాజాగా షాకిచ్చారు. మీరు ఎవరితో డిన్నర్ చేయాలని అనుకుంటున్నారని అడగ్గా.. అందరూ రామ్ పేరు చెబుతుందనే అనుకున్నారు. కానీ భాగ్యశ్రీ మాత్రం మరో స్టార్ పేరు బయటపెట్టి షాకిచ్చింది. నిఖిల్ విజయేంద్ర సింహా అనే యూట్యూబర్‌కి ఇచ్చని ఇంటర్వ్యూలో జరిగిన రాపిడ్ ఫైర్‌లో తన ఇష్టాయిష్టాలు బయటపెట్టారు భాగ్యశ్రీ. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్‌తో డిన్నర్‌కి వెళ్లాల్సి వస్తే ఎవరితో వెళ్తారని నిఖిల్ అడిగారు. దీనికి భాగ్యశ్రీ సమాధానం ఇస్తూ అనుష్క మేడం అని చెప్పింది.. ఏదో ఆన్సర్ వస్తుందనుకుంటే మరేదో రావడంతో నిఖిల్ కూడా షాకయ్యాడు. అనుష్క శెట్టి గారిని అందరూ ఇష్టపడతారు, ఆమె అద్భుతమైన నటి అని అతను కూడా కాంప్లిమెంట్ ఇచ్చాడు. అలాగే తనకు బిర్యానీ, ఎత్తైన కొండల్లో షికారుకు వెళ్లడం, ఒంటరిగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడం ఇష్టమని.. స్వీట్స్ బాగా తింటానని తన మనసులోని మాటను బయటపెట్టారు భాగ్యశ్రీ. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.More Articles