ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. రవితేజ హీరోగా నటించిన 'మిస్టర్ బచ్చన్' తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముంబై బ్యూటీ.. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా తన అందం, గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకున్న ఆమె.. ఇటీవల అక్కినేని అఖిల్ సరసన నటించిన 'లెనిన్' సినిమాతో కెరీర్‌లో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది భాగ్యశ్రీ. సినిమాల కంటే ఎక్కువగా తన వ్యక్తిగత జీవితం సంబంధించిన వార్తల్లో నిలుస్తున్నారు.

Advertisement
Advertisement

రామ్‌తో ప్రేమ వార్తలు.. ఎప్పటి నుంచో చర్చ
గత కొంతకాలంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరూ కలిసి నటిస్తున్న 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఈ రూమర్లు మొదలయ్యాయి. సెట్స్‌లో ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందనీ, వీరిద్దరూ తరుచుగా బయట కనిపించడంతో ఈ రూమర్స్ కు మరింత ఊతం ఇచ్చినట్టు అయింది. అంతేకాదు.. భాగ్యశ్రీ కోసం రామ్ ప్రత్యేకంగా ఒక పాటకు లిరిక్స్ కూడా రాశారనే వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారాన్ని రామ్ పోతినేని ఖండించినప్పటికీ, భాగ్యశ్రీ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Advertisement

ఇక 'లెనిన్' సినిమా ప్రమోషన్స్ సందర్భంగా పాల్గొన్న ఒక టాక్ షోలో భాగ్యశ్రీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తాను కలిసి పనిచేసిన హీరోల్లో "ఫ్రెండ్‌షిప్, డేటింగ్, మ్యారేజ్" ఎవరితో చేస్తారని యాంకర్ అడిగారు. దానికి భాగ్యశ్రీ నవ్వుతూ స్పందిస్తూ.. అఖిల్ అక్కినేని తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని చెప్పారు. అయితే డేటింగ్, మ్యారేజ్ విషయానికి రాగానే నేరుగా పేరు చెప్పకుండా, "నేను నటించిన హీరోల్లో పెళ్లి కాని వ్యక్తి ఒక్కడే ఉన్నాడు" అంటూ సిగ్గుపడిపోయారు. ఆమె సూచించింది రామ్ పోతినేనినేనని నెటిజన్లు వెంటనే గుర్తించారు. ఈ కామెంట్స్‌తో ప్రేమ వార్తలకు మరోసారి ఊపు వచ్చింది. సోషల్ మీడియాలో "ఇది పరోక్షంగా ఇచ్చిన హింట్" అంటూ అభిమానులు పెద్ద ఎత్తున చర్చించుకున్నారు.

Advertisement

రామ్‌పై ప్రశంసల జల్లు
తాజాగా మరో ఇంటర్వ్యూలో రామ్ పోతినేని గురించి మాట్లాడిన భాగ్యశ్రీ.. ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. "రామ్ పోతినేని నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయనతో కలిసి పని చేయడం చాలా మంచి అనుభవం. 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా మా అందరికీ ఎంతో ప్రత్యేకం.అతడు నటుడిగా మాత్రమే కాదు.. ఒక వ్యక్తిగా కూడా ఆయనపై నాకు ఎంతో గౌరవం ఉంది" అని చెప్పారు. రామ్ లాంటి వినయశీలి స్టార్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా కనిపిస్తారని, స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి అహంకారం లేకుండా అందరితో కలిసిపోతారని ఆమె తెలిపారు.

Advertisement

"ఇండస్ట్రీలో నాకు ఎప్పుడైనా ఏదైనా సందేహం వచ్చినా, సలహా అవసరమైనా నేను ముందుగా రామ్‌కే ఫోన్ చేస్తాను. ఆయన ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎన్నో సంవత్సరాల అనుభవంతో చాలా మంచి సూచనలు ఇస్తారు. ఇండస్ట్రీలో అలాంటి వ్యక్తి ఉండటం నిజంగా అదృష్టం" అని భాగ్యశ్రీ అన్నారు. రామ్ కొత్తవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తారని, కెమెరా ముందు ఎంత ఎనర్జీగా ఉంటారో, కెమెరా వెనుక కూడా అంతే ఫ్రెండ్లీగా, అందరితో ఆప్యాయంగా మెలుగుతారని చెప్పారు.

Advertisement

భాగ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో రామ్ అభిమానులు సరదాగా "భాగ్యశ్రీ పోతినేని" అంటూ పోస్టులు చేస్తున్నారు. కొందరు వీరిద్దరి కెమిస్ట్రీని ప్రశంసిస్తూ త్వరలో ఈ జంట నుంచి శుభవార్త వస్తుందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది కేవలం మంచి స్నేహం మాత్రమేనని, అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రేమ వార్తలను నిజమని భావించకూడదని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దీనిపై రామ్ పోతినేని ఎలా స్పందన ఇస్తారో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.