నటుడు సునీల్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో కమెడియన్‌గా, హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన టాలెంట్‌తో స్టార్ కమెడియన్‌గా ఎదిగిన ఆయన.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. మరోవైపు హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సునీల్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

Advertisement
Advertisement

కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఎస్తేర్ నొరోన్హా.. ముంబైలో చదువుకున్నారు. బాలనటిగా కొంకణి చిత్రాల్లో నటించి, అనంతరం హిందీ సినిమా బారొమాస్ ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తెలుగులో సాయిరామ్ శంకర్ నటించిన 1000 అబద్ధాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. భీమవరం బుల్లోడు, గరం, జయ జానకి నాయక, ఐరావతం, 69 సంస్కార్ కాలనీ, చెంగురే బంగారు రాజా, డెవిల్, టెనెంట్, థలా వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

Advertisement

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కారణంగానూ ఎస్తేర్ తరచూ వార్తల్లో నిలిచారు. సింగర్ నోయెల్‌ను ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె.. కొంతకాలానికే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వాటిపై పెద్దగా స్పందించని ఎస్తేర్.. ప్రస్తుతం పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.

ఎస్తేర్, సునీల్ తొలిసారి కలిసి పనిచేసింది భీమవరం బుల్లోడు సినిమా ద్వారా. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా మంచి స్నేహంగా మారిందని ఆమె తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. "సునీల్ గారు ఏ సినిమా వచ్చినా మిమ్మల్ని ముందుగా ప్రిపేర్ చేస్తుంటారు. మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏమిటి?" అని ప్రశ్నించగా.. ఎస్తేర్ ఎంతో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్నకు స్పందించిన ఎస్తేర్.. "సినిమా అనేది ఒక కమ్యూనికేషన్ . కళ అంటే సమాజానికి ఏదో ఒక విషయాన్ని చెప్పడం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నేను, సునీల్ గారు కలిసినప్పుడు మాత్రం సినిమాల గురించి అసలు మాట్లాడుకోం" అని చెప్పారు.

Advertisement

సాధారణంగా ఇండస్ట్రీలో కలిసే వ్యక్తులు కొత్త సినిమాలు, కథలు, హీరోలు, బడ్జెట్లు, బాక్సాఫీస్ కలెక్షన్లు వంటి విషయాలనే చర్చిస్తారని, కానీ తమ మధ్య అలాంటి సంభాషణలు చాలా అరుదుగా జరుగుతాయని ఆమె వెల్లడించారు. "మేమిద్దరం కలిసినప్పుడు ఈ మధ్య ఏ పుస్తకం చదివారు? ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఏదైనా సామాజిక సమస్య గురించి విన్నారా? దానిపై మీ అభిప్రాయం ఏమిటి? వంటి అంశాల గురించే మాట్లాడుకుంటాం. సినిమాల కంటే సమాజం గురించి, మనుషుల గురించి, ఆలోచనల గురించి ఎక్కువగా చర్చిస్తాం" అని ఎస్తేర్ తెలిపారు.

Advertisement

ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఇదే ప్రధాన కారణమని ఆమె చెప్పారు. ఒకే విధమైన ఆలోచనా విధానం ఉండటం వల్ల ఒకరినొకరు గౌరవించుకుంటామని పేర్కొన్నారు. . "ఆయన ఇండస్ట్రీలో చాలా చదువుకున్న వ్యక్తుల్లో ఒకరు. మా ఇద్దరి ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే మా ఆలోచనలు కూడా చాలావరకు కలుస్తాయి. మా ఇద్దరి ఐక్యూ లెవెల్స్ కూడా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది" అని సునీల్‌పై ప్రశంసలు కురిపించారు ఎస్తేర్. ఒక నటుడిగా మాత్రమే కాకుండా, సమాజంలోని వివిధ అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా కూడా సునీల్‌ను తాను గౌరవిస్తానని చెప్పారు.

Advertisement

ఎస్తేర్ మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. "సునీల్ గారు సామాజిక సమస్యలపై చాలా అవగాహనతో ఉంటారు. ఎల్జీబీటీ వంటి అంశాల గురించి కూడా నాతో చాలా సార్లు చర్చించారు. సమాజంలో ఉన్న సమస్యలపై మాట్లాడాలని, వాటిపై అవగాహన పెంచాలని నన్ను కూడా ప్రోత్సహించారు" అని చెప్పారు. ఒక నటుడిగా మాత్రమే కాకుండా బాధ్యతగల వ్యక్తిగా ఆయన ఆలోచించే తీరు తనకు ఎంతో నచ్చుతుందని పేర్కొన్నారు.

సునీల్‌తో తనకు ఉన్న సంబంధంపై వస్తున్న ప్రశ్నలకు ఎస్తేర్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత లేదా గాసిప్‌లకు తావులేని బంధం లేదని, పరస్పర గౌరవం, ఒకే విధమైన ఆలోచనా విధానం, పుస్తకాలపై ఆసక్తి, సామాజిక అంశాలపై చర్చలే తమ స్నేహానికి పునాది అని వివరించారు. ఇండస్ట్రీలో చాలా మంది సినిమాల గురించే మాట్లాడుకుంటే.. తాము మాత్రం సమాజాన్ని, విజ్ఞానాన్ని గురించి చర్చిస్తామని చెప్పిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.