బాలీవుడ్ అగ్ర నిర్మాత బోనీ కపూర్, మోనా శౌరిల కుమార్తె అన్షులా కపూర్ పెళ్లి రోహన్ థక్కర్‌తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. జూలై 6న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. జూన్ 21న రోహన్- అన్షులా పెళ్లి వేడుకలు ప్రారంభం కాగా.. జూలై 6తో ముగిశాయి. పంజాబీ, గుజరాతీ సాంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరిగింది. ఇక అన్షులా కపూర్ పెళ్లి వేడుకలు మొదలైన నాటి నుంచి జాన్వీ కపూర్ సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా తన ప్రియుడిపై ప్రేమను ఆమె బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

అన్షులా - రోహన్‌కు ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు మారగా.. అన్షులాకు రోహన్ ప్రపోజ్ చేశారు. తాము రిలేషన్‌లో ఉన్నట్లు వీరిద్దరూ 2023లో బయటపెట్టారు. అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో జూలై 2025లో వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అదే ఏడాది అక్టోబర్‌లో గోర్ ధానా వేడుకను నిర్వహించారు. ఇక రోహన్ థక్కర్ విషయానికి వస్తే.. ఆయన సినీరంగానికి సంబంధం ఉన్న వ్యక్తే. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్‌కు చెందిన ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫ్రీలాన్స్ స్క్రీన్ రైటర్‌గా పనిచేస్తున్నారు.

Advertisement

రోహన్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి ప్లేరైటింగ్‌ అండ్ స్క్రీన్ రైటింగ్‌లో మాస్టర్స్ చేశాడు. సినీరంగానికి రాకముందు పలు డిజిటల్ మీడియా సంస్థలు, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలలో పనిచేశారు. ప్రస్తుతం కరణ్ జోహర్ సంస్థలో వెబ్ సిరీస్‌లు, సినిమాలకు స్క్రీన్ రైటర్‌గా కథలు అందిస్తున్నారు. ఇక అన్షులా విషయానికి వస్తే.. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్‌ దంపతుల కుమార్తె. వీరికి కుమారుడు అర్జున్ కపూర్ కూడా ఉన్నాడు. 1996లో మోనా శౌరీకి విడాకులిచ్చిన బోనీ అదే ఏడాది శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఖుషి కపూర్, జాన్వీ కపూర్ సంతానం. మోనా శౌరీ 2012లో అనారోగ్యంతో కన్నుమూయగా.. శ్రీదేవి దుబాయ్‌లో 2018లో హఠాన్మరణం చెందారు. తల్లులు వేరైనా జాన్వీ, ఖుషి, అర్జున్, అన్షులాలు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు.

Advertisement

ఇదిలాఉండగా.. అన్షులా- రోహన్‌ల పెళ్లి కార్యక్రమాలు మొదలైన నాటి నుంచి అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారట ఖుషి. తాజాగా రిసెప్షన్‌లోనూ ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదే సమయంలో ఆమె ప్రేమ విషయం హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి వేడుక కోసం జాన్వీ కపూర్ వేసుకున్న మెహందీలో తన ప్రియుడు శిఖర్ పహారియ పేరును ఆమె రాసుకున్నారు. అతనిని ప్రేమతో పిలుచుకునే శిఖు అంటూ రాసుకొచ్చింది.

Advertisement

ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బీ టౌన్ మీడియా కోడై కూసింది. అందుకు తగినట్లుగానే ఒకే కారులో వీరిద్దరూ ప్రయాణించడం, పలు పార్టీలలో స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. కానీ ఆమె తండ్రి బోనీ మాత్రం ఈ రూమర్స్‌ని ఖండించారు. అలాంటిది స్వయంగా అక్క పెళ్లిలో ప్రియుడిపై ప్రేమను జాన్వీ కపూర్ ఇలా బయటపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. పరిస్ధితి చూస్తుంటే త్వరలోనే బోనీ కపూర్ ఇంట్లో మరోసారి పెళ్లిభాజాలు మోగుతాయని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.