అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ పాపులరిటీని సొంతం చేసుకుంది. తర్వాత వరసగా సినిమాలు చేస్తూ తన నటనతో అందరిమనసు దోచేస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచీ తనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టే సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా జాన్వీ కపూర్ వార్తల్లో నిలిచింది. ఈ సారి తన సినిమాలతో కాదు.. తన ఫన్నీ కామెంట్స్.. ఫన్నీ రిప్లైతో.. ఇంతకీ ఏమైంది? అసలేం జరిగింది?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది ఈ చిన్నది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక ఇటీవల పెద్ది సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించి, మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది. సౌత్ ఇండియా మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ తన క్యూట్ నెస్‌తో అందరిని మాయ చేస్తుంది.
ఇటీవల జాన్వీ కపూర్ తన సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ అక్కచెల్లెలు సందడి చేశారు. ఈ షోలో భాగంగా జాన్వీ ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఓ బాలీవుడ్ నటుడు తనకు పంపిన ఫ్లర్టీ మెసేజ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. షోలో భాగంగా ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో జాన్వీ పాల్గొన్నారు. తన సోదరి ఖుషీ మాత్రం తొలిసారిగా ఈ షోలో పాల్గొనగా, జాన్వీకి మాత్రం ఎన్నిసార్లు వచ్చినా కాఫీ హ్యాంపర్ గెలవలేకపోయానని ఫీల్ అయింది. ఇక ర్యాపిడ్ ఫైర్‌లో కరణ్ జోహర్, "మీకు ఇప్పటివరకు వచ్చిన అత్యంత విచిత్రమైన ఫ్లర్టీ మెసేజ్ ఏది?" అని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పే ముందు జాన్వీ తన సోదరి ఖుషీ వైపు చూసి.. "ఇది చెబితే నువ్వు నన్ను తిడతావేమో" అంటూ నవ్వింది. ఆ తర్వాత ఆ మెసేజ్‌గురించి చెబుతూ.. నేను నీ బాడీపై ఉన్న బ్యూటీ స్పాట్స్ చూడొచ్చా? అని ఓ నటుడు తనకు మెసేజ్ పంపినట్లు తెలిపింది. జాన్వీ సమాధానం విన్న కరణ్ జోహర్ షాక్ అయ్యారు. ఆ వెంటనే "నీకు ఎన్ని బ్యూటీ స్పాట్స్ ఉన్నాయి?" అని సరదాగా ప్రశ్నించగా, జాన్వీ నవ్వుతూ "చాలానే ఉన్నాయి" అంటూ సెటైరికల్ గా సమాధానమిచ్చింది. అయితే, జాన్వీ తనకు ఫ్లర్టీ మెసేజ్ పంపిన వ్యక్తి పేరు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జానుపాప చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.More Articles