తన అందం, నటనతో దక్షిణాది ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందారు మాళవిక. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత కెరీర్‌కు బ్రేక్ ఇచ్చి భర్త, కుటుంబంతో గడుపుతోంది. సినీరంగానికి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాళవిక బోల్డ్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

బెంగళూరులో స్థిరపడిన మలయాళ కుటుంబంలో జన్మించారు మాళవిక. ఆమె పూర్తి పేరు శ్వేత కొన్నూర్ మీనన్. 19 ఏళ్ల వయసులోనే నటిగా తన ప్రస్థానం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. దివంగత ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చాలా బాగుంది సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియ నేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ తదితర సినిమాలతో తెలుగు వారిని అలరించారు.

తెలుగులో అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌కు దూరమై తమిళ ఇండస్ట్రీపైనే ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యారు మాళవిక. అయితే అక్కడ కూడా ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలే వచ్చేవి, కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్ పోషించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సుమేశ్ మీనన్ అనే వ్యక్తిని 2007లో పెళ్లాడారు మాళవిక. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. భర్త, కుటుంబ బాధ్యతల కారణంగా సినీ రంగానికి దూరమయ్యారు మాళవిక. దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మాళవిక ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది విడుదలైన ప్రదీప్ రంగనాథన్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మాళవిక కీలకపాత్ర పోషించారు.

Advertisement

పెళ్లికి తోడు, వయసు కారణంగా మాళవిక రూపం మారిపోయింది. ఒకప్పుడు అందానికి కేరాఫ్‌గా ఉంటూ, ముఖంపై చెరగని చిరునవ్వుతో కనిపించిన మాళవిక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అయినప్పటికీ జిమ్, వర్కవుట్స్ ద్వారా శరీరాన్ని నాజూకుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత వివరాలు, ఇతర సంగతులను పంచుకుంటున్నారు. 90ల నాటి హీరోయిన్స్, తన స్నేహితురాళ్లతో అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.

Advertisement

50కి చేరువ అవుతున్నా చెక్కు చెదరని గ్లామర్‌తో రెచ్చగొడుతున్నారు మాళవిక. జిమ్, వర్కవుట్, యోగా ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లలో సెగలు రేపుతున్నారు మాళవిక. సినిమాలలో చాలా పద్ధతిగా కనిపిస్తూ హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి.. సోషల్ మీడియాలో అది కూడా ఈ వయసులో అందాల ఆరబోతతో రచ్చ చేస్తూ షాకిస్తున్నారు.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జూలై 19 మాళవిక పుట్టినరోజు .. ఈ సందర్భంగా మాల్దీవుల్లో టూర్‌కి వెళ్లిన ఆమె అక్కడి గిలి లంకన్‌ఫ్యూజీ బీచ్‌ ఒడ్డున స్విమ్ సూట్‌ ధరించి ఫోటో షూట్ నిర్వహించారు. ఎద అందాలు కనిపించేలా గులాబీ రంగు డ్రెస్‌లో రెచ్చిపోయింది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ ముద్దుగుమ్మ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Advertisement