టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్ కపుల్స్‌ నాగచైతన్య- శోభిత ధూళిపాళ. ఈ జంట మరోసారి తమ క్యూట్ కెమిస్ట్రీతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా వరకు గోప్యంగానే ఉంచుతున్నారు. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య ఓ పోస్ట్ చేశారు. అయితే.. ఆ పోస్ట్ కు శోభిత కూడా ఫన్నీ కౌంటర్ ఇవ్వడం.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏమైందంటే?

Advertisement
Advertisement

హీరో నాగచైతన్య శుక్రవారం రాత్రి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఫొటోను పంచుకున్నారు. ఆ ఫొటోలో శోభిత ధూళిపాళ క్యాజువల్ లౌంజ్‌వేర్‌లో ఎంతో సాధారణంగా కనిపించింది. చేతుల్లో రెండు బౌల్స్ పట్టుకుని డైనింగ్ టేబుల్ వైపు వస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఆ మూవెంట్ ను చైతూ కెమెరాలో బంధించారు. ఒక బౌల్‌లో నూడుల్స్, మరో బౌల్‌లో కూరగాయలతో చేసిన రైస్ ఉన్నట్లు కనిపించింది. ఎలాంటి మేకప్ హంగులు లేకుండా, ఇంట్లో భర్త కోసం ప్రేమగా డిన్నర్ తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. శోభిత ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Advertisement

ఆ ఫొటోకు నాగచైతన్య పెట్టిన క్యాప్షన్ హైలెట్ మారింది. 'పెళ్లై దాదాపు రెండేళ్లు అవుతున్న తర్వాత నా కోసం వైఫ్ డిన్నర్ వండింది. అంటే ఈ రోజు నేను ఏదో మంచి పని చేసినట్టున్నా.'అంటూ ఫన్నీగా రాశారు. చైతూ కామెంట్ వైరల్ గా మారింది. ఆ పోస్ట్ కు రిప్లే కూడా మరింత ఇంట్రెసింగ్ గా ఉన్నాయి. తన భర్త పోస్ట్ చూసిన శోభిత కూడా వెంటనే కామెంట్ సెక్షన్‌లో స్పందించింది. "నన్ను ట్రోల్ చేస్తున్నావా... లేక పొగుడుతున్నావా?"అంటూ చిలిపిగా ప్రశ్నించింది. ఈ ఒక్క కామెంట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయింది. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. "ఇద్దరూ ఒకరినొకరు ఆటపట్టించుకోవడం చాలా నేచురల్‌గా ఉంది", "ఈ జంట చాలా క్యూట్" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

నాగచైతన్య చేసిన ఈ కామెంట్ వెనుక ఓ ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 2025లో ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఆ సమయంలో "మీ ఇద్దరిలో బాగా వంట చేసేది ఎవరు?" అని ప్రశ్నించగా నాగచైతన్య నవ్వుతూ.. "మా ఇద్దరిలో ఎవ్వరూ కుక్స్ కాదు." అని సమాధానం ఇచ్చారు. అప్పుడు శోభిత మాట్లాడుతూ.. ప్రతి రాత్రి నాకు హాట్ చాక్లెట్ చేసి ఇస్తాడు అంటూ భర్తను ప్రశంసించింది. అయితే చైతూ వెంటనే.. "హాట్ చాక్లెట్, కాఫీ చేయడం వంటలోకి రాదు. అవి ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన బేసిక్ హ్యూమన్ స్కిల్స్ మాత్రమే. అవి కూడా నీకు లేవు." అంటూ సరదాగా పంచ్ వేశారు. ఈ వ్యాఖ్య అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

Advertisement

2021లో సమంత రూత్ ప్రభుతో విడాకుల తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. 2022లో వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన ఫొటోలు బయటకు రావడంతో ఆ ప్రచారం మరింత బలపడింది. అయితే తమ ప్రేమ గురించి ఇద్దరూ చాలా కాలం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తమ రిలేషన్‌షిప్‌పై ఇద్దరూ చాలా కాలం మౌనం పాటించారు. 2024లో నిశ్చితార్థంతో తమ ప్రేమను అధికారికంగా ప్రకటించారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

Advertisement

వరుస సినిమాలతో బిజీ
ప్రస్తుతం నాగచైతన్య, శోభిత ఇద్దరూ తమ కెరీర్‌పై దృష్టి సారించారు. శోభిత చివరిసారిగా తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో తమిళ సైన్స్ ఫిక్షన్ డ్రామా 'వెట్టువమ్'లో నటించనుంది. మరోవైపు నాగచైతన్య తన తదుపరి చిత్రం 'వృషకర్మ'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. మైథలాజికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుందని సమాచారం.