నమిత.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన భారీ అందాలతో ఒకప్పుడు కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్‌గా వెలుగొందారు. తమిళనాడులో అయితే అభిమానులు ఈమెకు గుడి కట్టి పూజించారంటే నమిత రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొన్నేళ్లుగా నమిత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మీడియాను కూడా దూరంగానే ఉంచుతున్నారు. అయితే తాజాగా నమితకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన నమిత పూర్తి పేరు నమిత ముఖేష్ వంకావాలా. తొలుత మోడలింగ్‌లోకి దిగిన నమిత.. 17 ఏళ్ల వయసులోనే మిస్ సూరత్‌ కిరీటం దక్కించుకున్నారు. 2001లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్న నమిత.. థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. అనంతరం తన మకాంను ముంబైకి మార్చి వాణిజ్య ప్రకటనలలో నటించడం మొదలుపెట్టారు నమిత. హిమాని క్రీమ్, అరుణ్ ఐస్‌క్రీమ్, మాణిక్‌చంద్ గుట్కా తదితర టాప్ బ్రాండ్స్‌కు చెందిన కమర్షియల్ యాడ్స్‌లో నటించడంతో ఆమెకు గుర్తింపు వచ్చింది.

ఈ దశలో టాలీవుడ్ డైరెక్టర్ శ్రీనువైట్ల కళ్లలో పడిన నమితకు సొంతం సినిమాలో అవకాశం దక్కింది. అనంతరం జెమినీ, బిల్లా, సింహా తదితర చిత్రాలలో నటించారు. ఎంగా అన్నా అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన నమితను తమిళ తంబీలు ఆదరించారు. బొద్దుగా, ముద్దుగా ఉండటం, నటనతో ఆమె అక్కడ స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆమెకు ఏకంగా గుడికట్టి పూజించే స్థాయిలో వీరాభిమానులు ఉన్నారు. 25 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించారు నమిత.

Advertisement

అయితే విపరీతంగా బరువు పెరిగిపోవడం, కొత్త అమ్మాయిత రాకతో నమితకు అవకాశాలు తగ్గాయి. 2010 వరకు ఆమె కెరీర్ గ్రాఫ్ దూసుకెళ్లింది. ఆ తర్వాతి నుంచి ఒకటి ఆరా సినిమాలలో నటిస్తూ వచ్చింది. 2020లో చివరిసారిగా మియా అనే తమిళ సినిమాలో నమిత నటించారు. 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యాపారవేత్తను తిరుపతిలో పెళ్లాడారు నమిత. 2022లో నమిత కవలలకు జన్మనిచ్చారు. రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తిగా ఉండే నమిత.. 2016లో దివంగత తమిళనాడు సీఎం జయలలిత సమక్షంలో ఏఐఏడీఎంకేలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి 2019లో జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖలో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నమిత వ్యవహరిస్తున్నారు.

Advertisement

సినిమాలు చేయకున్నా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు నమిత. సినిమాల సంగతులు, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. బ్యూటీ, యోగా, హెల్త్ కేర్ టిప్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. జిమ్‌లో సెల్ఫీ వీడియో తీసి అద్దం ముందు ఫోజులు ఇస్తూ నమిత కనిపించారు. అయితే ఇందులో బక్క చిక్కిపోయి, కొత్త లుక్‌లో ఆమె దర్శనమిచ్చారు.

Advertisement

ఒకప్పుడు బరువు పెరిగిపోయిన నమిత ఇప్పుడు స్లిమ్ లుక్‌లో పాతికేళ్ల అమ్మాయిలా ట్రాన్స్‌ఫర్మ్ అయ్యారు. ఈ పోస్ట్‌కు మీ మనసు ఏది నమ్ముతుందో.. శరీరం దానినే అనుసరిస్తుందని రాసుకొచ్చారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా కష్టపడి స్లిమ్‌గా ఎందుకు మారింది? నమిత మరోసారి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నమిత ప్లాన్ ఏంటో త్వరలోనే తేలియనుంది.