భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న మద్దుగుమ్మలు ఒక్కొక్కరిగా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వివాహ జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటి వరకు సీక్రెట్‌గా బంధాన్ని సాగించిన వారు తమ బాయ్‌ఫ్రెండ్స్, పార్ట్‌నర్స్‌ను పరిచయం చేస్తూ సైలెంట్‌గా షాకిస్తున్నారు. మరికొందరు మాత్రం పెళ్లి ఇప్పుడే కాదంటూ దాటవేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్.. తన పెళ్లి, కాబోయే భర్తకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ సరైన బ్రేక్ దక్కించుకోలేకపోయారు నిధి అగర్వాల్. తనకంటే వెనుక వచ్చిన హీరోయిన్లు మంచి హిట్స్‌తో స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తుండగా నిధి కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. సవ్యసాచితో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన నిధి అగర్వాల్.. ఆ వెంటనే మిస్టర్ మజ్నూతో బ్యాక్ టూ బ్యాక్ అక్కినేని హీరోలతో సినిమాలు చేసింది. కానీ అవి ఆశించినంతగా ఆడలేదు. ఇస్మార్ట్ శంకర్‌తో బ్రేక్ అందుకున్నప్పటికీ ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ అనే సినిమాలతో తమిళంలో అడుగుపెట్టినప్పటికీ అక్కడా రిజల్ట్ కనిపించలేదు. తిరిగి టాలీవుడ్‌లోనే అదృష్టం వెతుక్కునే పనిలో ఆమెకు హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలలో ఆఫర్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి సూపర్‌స్టార్ల సినిమాలలో అవకాశాలు రావడంతో తన కెరీర్ గాడినపడినట్లేనని భావించింది. ఈ రెండు సినిమాల కోసం అన్ని పనులు పక్కన పెట్టి పనిచేసింది, షూటింగ్స్ ఆలస్యమైనా తట్టుకుని నిలబడింది. వీరమల్లు ప్రమోషన్స్‌కి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో తనే ఈ భారమంతా మోసింది, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్‌తో చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ ప్రశంసలు సైతం దక్కించుకుంది. కానీ హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

Advertisement

రాజాసాబ్‌పైనే ఆమె ఆశలు పెట్టుకోగా.. ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచి నిధి అగర్వాల్ కలల్ని కూల్చేసింది. దాంతో ఆమె కెరీర్ ముగిసినట్లేనా అన్న కథనాలు కూడా వచ్చాయి. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి యంగ్ బ్యూటీస్ నుంచి నిధికి గట్టి పోటీ ఎదురవుతోంది. అయినప్పటికీ అవకాశాల కోసం గట్టిగానే కృషి చేస్తోంది. ఆల్రెడీ 30 క్రాస్ చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో నిధి ప్రేమాయణం సాగించిందని, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరూ ఖండించడంతో వాటికి చెక్ పడింది.

Advertisement

తాజాగా తిరుపతిలో ఓ ప్రముఖ మొబైల్ షోరూం ఓపెనింగ్ కోసం వచ్చిన శ్రీనిధికి మీడియా నుంచి పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. ఇంకా సరైన వరుడు దొరకలేదు, మంచి సంబంధం వస్తే చేసుకుంటానని నిధి తెలిపారు. అయితే ఎలాంటి అబ్బాయి కావాలని విలేకరులు అడగ్గా.. బాగా డబ్బున్న వ్యక్తి భర్తగా రావాలని ఆమె ఫన్నీగా ఆన్సర్ ఇచ్చారు. అయితే తనకు దక్షిణాది అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని.. పెళ్లి తర్వాత తిరుపతికి వస్తానని తన మనసులోని మాటను బయటపెట్టారు నిధి. ప్రస్తుతం 2 హిందీ సినిమాలలో నటిస్తున్నానని, మరో 2 తెలుగు సినిమాలకు సంతకం చేశానని, ఆగస్ట్ 17న తన పుట్టినరోజు నాడు మరిన్ని వివరాలు ప్రకటిస్తానని నిధి అగర్వాల్ వెల్లడించారు.