Top 10 Heroines: దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఓర్మాక్స్ మీడియా ర్యాంకింగ్స్ వెలువబడ్డాయి. ఓర్మాక్స్ మీడియా 'ఇండియా లవ్స్' మోస్ట్ పాపులర్ ఫిమేల్ ఫిల్మ్ స్టార్స్ పేరింట టాప్ 10 హీరోయిన్ జాబితాను విడుదల చేసింది. ప్రతి నెల సోషల్ మీడియా ట్రెండ్స్, ఆడియన్స్ ఆసక్తి, పాపులారిటీ, డిజిటల్ ఎంగేజ్‌మెంట్ వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితాను ఓర్మాక్స్ విడుదల చేస్తుంది. తాజాగా 2026 జూన్ నెలకు సంబంధించిన టాప్-10 హీరోయిన్ల జాబితా వెలువడింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న హీరోయిన్ ఎవరు? ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు? వివరాల్లోకెళ్తే..

Advertisement
Advertisement

సమంతకు తిరుగులేదు
సమంత రుత్ ప్రభు.. మరోసారి టాప్ వన్ గా నిలిచింది. గత మూడు నెలలుగా టాప్ లో ఉంటున్నా ఈ హీరోయిన్.. జూన్ నెలలో కూడా ఆధిపత్యాన్ని కొనసాగించింది. వరుసగా మరోసారి నంబర్-1 స్థానాన్ని దక్కించుకుంది. గత కొన్ని నెలలుగా మధ్యలో ఒకసారి రెండు సార్లు మినహా సమంత టాప్ ప్లేస్‌ను వదలడం లేదు. ఇటీవల సమంత నటించిన 'మా ఇంటి బంగారం'సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ మరింత క్రేజ్ పెరిగింది. సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమెకు ఉన్న భారీ ఫాలోయింగ్, ప్రెగ్నెన్సీ అప్‌డేట్స్ ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టాయి.

Advertisement

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, దీపికా పదుకొణె మూడో స్థానంలో కొనసాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ ఇద్దరికీ ఉన్న క్రేజ్ వీరిని ఈ స్థానాల్లో నిలబెట్టింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల పెద్ద సినిమా విడుదల కాకపోయినా, పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ఆమె స్థానం మారలేదు. సోషల్ మీడియాలోనూ రష్మికకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో టాప్-5లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Advertisement

టాప్-5లో కాజల్
సీనియర్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఐదో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గినా, కమర్షియల్ యాడ్స్, సోషల్ మీడియా యాక్టివిటీ, పబ్లిక్ అపియరెన్స్‌లతో ఆమె ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. 'ది ఇండియా స్టోరీ'అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల మందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఆమెకు కలిసి వస్తున్నాయి. అదే ఆమెకు ఈ ర్యాంక్‌ను నిలబెట్టిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

సాయి పల్లవికి జోరు
జూన్ నెల ర్యాంకింగ్స్‌లో సాయి పల్లవి స్థానం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కితున్న (Ramayana)సినిమాలో సీతాగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. దీంతో సాయిపల్లవి క్రేజ్ మరింత పెరిగింది. దీంతో మే నెలలో ఏడో స్థానంలో ఉన్న ఆమె, జూన్‌లో ఆరో స్థానానికి ఎగబాకింది. 'రామాయణ' ప్రాజెక్ట్‌పై పెరిగిన చర్చలు, ఆమె పాత్రపై ఉన్న ఆసక్తి ఈ ర్యాంక్ పెరగడానికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.

మే నెలలో ఎనిమిదో స్థానంలో ఉన్న కృతి సనన్, ఈసారి ఏడో స్థానానికి చేరుకుంది. బాలీవుడ్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టులు, జాతీయ స్థాయిలో ఆమెకు ఉన్న గుర్తింపు ఈ ర్యాంక్‌కు దోహదపడినట్లు తెలుస్తోంది. ఈసారి జాబితాలో అత్యంత చర్చనీయ అంశం నయనతార ర్యాంకింగ్. ఈ హీరోయిన్ గత నెలలో ఆరో స్థానంలో ఉన్న లేడీ సూపర్ స్టార్, ఈసారి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. అంటే ఏకంగా రెండు స్థానాలు పడిపోయింది. ఇటీవల ఆమె నుంచి పెద్ద సినిమా విడుదల కాకపోవడం, జాతీయ స్థాయిలో తక్కువ ప్రచారం ఉండటం దీనికి కారణంగా భావిస్తున్నారు.

Advertisement

త్రిష స్థానం యథాతథం
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష తొమ్మిదో స్థానాన్ని నిలబెట్టుకుంది. గత నెలలోనూ అదే స్థానంలో ఉన్న ఆమె, తన ర్యాంక్‌ను కాపాడుకోవడం విశేషం. ప్రస్తుతం చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులు భవిష్యత్ ర్యాంకింగ్స్‌లో ఆమెకు మరింత ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక జూన్ ర్యాంకింగ్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు శ్రీలీల. మే నెల టాప్-10 జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. అయితే జూన్‌లో పదో స్థానంతో మళ్లీ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె కొత్త సినిమాల అనౌన్స్ మెంట్, సోషల్ మీడియాలో పెరిగిన యాక్టివిటీ, వరుసగా వస్తున్న వార్తలు ఈ రీఎంట్రీకి కారణమయ్యాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం.. మే నెలలో పదో స్థానంలో ఉన్న కత్రినా కైఫ్.. జూన్ జాబితాలో పూర్తిగా కనిపించలేదు. ఆమె స్థానాన్ని శ్రీలీల దక్కించుకోవడం ఈ నెల ర్యాంకింగ్స్‌లో మరో ముఖ్యమైన మార్పుగా చెప్పొచ్చు.