పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటన, మాస్ యాక్టింగ్ కంటే తన మంచి మనసు, వ్యక్తిత్వం ద్వారానే ప్రభాస్ కోట్లాది మందికి అభిమాన నటుడు అయ్యాడు. పాతికేళ్ల కెరీర్‌లో ఎలాంటి వివాదం లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ప్రభాస్. ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఇతర టెక్నీషియన్స్ కూడా ప్రభాస్ గురించి చెడుగా మాట్లాడలేదంటే ఆయన గొప్పతనం తెలుసుకోవచ్చు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement
Advertisement

మోడలింగ్ నుంచి సినీరంగంలో అడుగుపెట్టారు పూజా హెగ్డే. కెరీర్ తొలినాళ్లలో ఆమె సినిమాలు ఫ్లాప్ కావడంతో ఐరెన్ లెగ్ అన్న ముద్రపడింది. అయితే అవమానాలను భరించి, తన ప్రతిభతోనే అగ్రనటిగా దూసుకొచ్చారు బుట్టబొమ్మ. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న పూజా హెగ్డే కెరీర్‌ను మరోసారి ఫ్లాపులు దెబ్బకొట్టాయి. రాధేశ్యామ్, ఆచార్య, రెట్రో, దేవా తదితర సినిమాలు డిజాస్టర్ కావడంతో పాటు కొన్ని సినిమాల నుంచి ఆమెను తప్పించడంతో ఇక పూజా హెగ్డే కెరీర్ ముగిసిందని వార్తలు వచ్చాయి. అయినప్పటికీ మరోసారి పట్టుదలతో ప్రయత్నించి అవకాశాలు అందుకున్నారు.

Advertisement

పూజా ఎన్నో ఆశలు పెట్టుకున్న దళపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్.. వివాదాల్లో చిక్కుకుని రిలీజ్‌కి నోచుకోవడం లేదు. త్వరలోనే ఈ సినిమా విడుదల అవుతుందని భావిస్తున్నారు. హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా డిజాస్టర్ కావడంతో హిందీలోనూ బుట్టబొమ్మ కెరీర్ డైలామాలో పడింది. ప్రస్తుతం తమిళంలో కాంచన 4, తెలుగులో శ్రీశ్రీ సినిమాలలో నటిస్తున్నారు పూజా హెగ్డే. సాలీడ్ హిట్ పడితే అవకాశాలు తిరిగి క్యూ కడతాయని ఆమె భావిస్తున్నారు.

Advertisement

ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు తనతో కలిసి పనిచేసిన స్టార్స్ గురించి, ఆమె ఇష్టాయిష్టాల గురించి చెప్పింది. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి ఏమైనా నేర్చుకున్నారా? ఆయన ఏదైనా సలహా ఇచ్చారా అని యాంకర్ ప్రశ్నించింది. దీనికి పూజా హెగ్డే స్పందిస్తూ.. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ టైంలో నాకు బాగా గుర్తున్న జ్ఞాపకం మంచి ఆహారం. ప్రభాస్ నా కోసం ప్రతిరోజూ తన ఇంటి నుంచి పెద్ద పెద్ద డబ్బాలలో రుచికరమైన భోజనాన్ని తెప్పించేవారు. అప్పుడు నాకు ఒక్కటే అనిపించేది.. అతని వ్యక్తిగత వంట మనిషిని ఎత్తుకెళ్లిపోవాలని ఉండేది అని పూజా హెగ్డే నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. డార్లింగ్ మంచి మనసుపై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తెలుగు హీరోలలో రామ్ చరణ్‌ ఎనర్జీ, అల్లు అర్జున్ స్వాగ్ తనకు ఇష్టమని పూజా తెలిపారు.

Advertisement

ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్ సినిమాలో కలిసి నటించారు పూజా హెగ్డే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 మార్చి 11న విడుదలై .. ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ప్రభాస్- పూజా హెగ్డే జంటకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ప్రభాస్ సరసన కొన్ని సినిమాలకు హీరోయిన్‌గా ఆమె పేరు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే భవిష్యత్తులో ప్రభాస్- పూజా హెగ్డేల జోడీ మరోసారి వెండితెరపై సందడి చేసే అవకాశాలు లేకపోలేదు.