సినీరంగంలో ఉన్న వారి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సినీతారల జీవితాలు చివరి రోజుల్లో ఎలా గడిచాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ తరంలో ఇండస్ట్రీలోకి వచ్చే వారు మాత్రం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వ్యాపారాలు, పెట్టుబడులు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో రెండు చేతుల సంపాదిస్తున్నారు. ఒకటి కాకపోయినా మరో మార్గం ద్వారా బయటపడుతున్నారు. తాజాగా ఇదే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాశీ సింగ్. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాశీ సింగ్ తొలుత ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. అనంతరం శశి మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆపై ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, బ్లైండ్ స్పాట్, పాంచ్ మినార్, సంతాన ప్రాప్తిరస్తు, ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు తదితర సినిమాలలో నటించారు. ఉత్తరాదికి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఎంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నారు. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను అలరించారు.

Advertisement

వెండితెరపైనే కాదు బుల్లితెరపైనా రాశి సింగ్ సత్తా చాటారు. పాపం పసివాడు, త్రీ రోజెస్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించారు. డీగ్లామరైజ్డ్, సీరియస్ రోల్స్ చేసినప్పటికీ రియల్ లైఫ్‌లో మాత్రం రాశి సింగ్ ఎంతో స్టైలిష్‌గా ఉంటారు. తనకు సినిమాలు, వ్యాపారాలు రెండూ ఇష్టమే. నేనింకా చాలా చేయాల్సి ఉందని పలుమార్లు ఆమె చెప్పారు. రెస్టారెంట్‌, కెఫే వ్యాపారాలను రాశి సింగ్ నిర్వహిస్తూ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ఉమెన్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ముద్దుగుమ్మ వ్యాపారాల గురించి ఇటీవల హీరో వడ్డే నవీన్ చెబుతూ ఆశ్చర్యపోయారు. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని రాశి సింగ్ వెల్లడించారు.

Advertisement

ఇదిలాఉండగా.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సంపాదిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, హీరోయిన్లు యవ్వారాలు బయటపడుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ద్వారా ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ పేరిట హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనిలోకి దిగుతున్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు ఇలాంటివి కాకుండా బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ప్రమోషనల్ వీడియోలతో బాగానే సంపాదిస్తున్నారు. తద్వారా ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీలకు కామధేనువుగా మారింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశి సింగ్ మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

డబ్బు సంపాదించుకోవడానికి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ మంచి ప్లాట్‌ఫాం. యాక్టర్స్ మాత్రమే కాదు, ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా చాలా బ్రాండ్స్ చేస్తున్నారు. అలా అనీ ఇది బ్యాకప్‌లా ఉపయోగపడుతుందని కాదు.. ఒకవేళ సినిమాలు చేతిలో లేకపోయినా ఎంతో కొంత ఆదాయమైతే పక్కా. యాక్టర్ కాబట్టి మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమాలు చేయాలి. ఒక మామూలు ఇన్‌ఫ్లూయెన్సర్, యాక్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేటర్‌గా ఉంటే.. అతని కంటే మీరు కొత్తగా చేయాలి. అలాగని ఇష్టమొచ్చినట్లు సాంగ్స్, డ్యాన్స్‌లు చేయలేం కదా. ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సాంగ్స్, డ్యాన్స్ చేస్తేనే ఫాలోవర్స్ పెరుగుతారు. అలాగే నా సినిమా జోన్‌ను నేను మిస్ అవ్వకూడదు. చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు టాప్ ఫాలోయింగ్ స్పాట్‌లు. నేను ఏ సాంగ్ చేయాలి? ఏది ఎక్కువ? ఏది తక్కువ? అనేది నిర్ధారించుకోవాలి. అదే జస్ట్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంటే అలాంటి ఇబ్బందులు లేవు. కెమెరా ముందుకెళ్లి నా గురించి, నా అభిప్రాయాలు చెప్పినప్పుడు బాగానే వర్కవుట్ అవుతుందని రాశి సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.