రూమర్లను నమ్మొద్దు.. రష్మిక.. బ్రేకప్ తర్వాత మీడియా ముందుకు!


కన్నడ హీరో రక్షిత్ శెట్టి‌తో బ్రేకప్ తర్వాత తొలిసారి రష్మిక మందన్న మీడియా ముందుకు వచ్చారు. రష్మిక తాజాగా తుమకూరు సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నటుడు రక్షిత్‌శెట్టితో ప్రేమ, పెళ్లికి బ్రేకప్‌ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లితో కలిసి ఆమె స్వామీజీ దర్శించుకొన్నారు.

అనంతరం రష్మిక మీడియాతో మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల నిశ్చితార్థం రద్దు జరిగింది. అయితే ఈ వ్యవహారంలో తనపై వస్తున్న రూమర్లను, ఊహాగానాలను నమ్మవద్దు. అవసరం వచ్చినప్పుడు కారణాలు బయటకు వెల్లడిస్తాం. అప్పటి వరకు సహనంతో ఉండండి అని రష్మిక పేర్కొన్నారు.

రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఎంగేజ్‌మెంట్‌పై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటికి ముగింపు పలికేందుకు వారి కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. రష్మిక తల్లి సుమన్ మందన్న నిశ్చితార్థం బ్రేకప్ జరిగిన విషయం నిజమే. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాం అని ఆమె వెల్లడించడం తెలిసిందే.

రష్మికతో బ్రేకప్ తర్వాత రక్షిత్ శెట్టి సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. బ్రేకప్ జరిగింది వాస్తవమే కానీ.. రష్మిక గురించి ఏదో ఊహించుకొంటున్నారు. ఆమెపై తప్పుడుగా అభిప్రాయం ఏర్పరచుకోవద్దు అని పేర్కొన్నాడు.

Rashmika Mandanna Breaks Her Engagement With Rakshit Shetty...?

ప్రస్తుతం గీతా గోవిందం సక్సెస్‌తో రష్మిక జోష్‌లో ఉంది. ఆమె నటించిన దేవదాస్ రిలీజ్‌కు సిద్దమవుతున్నది. అలాగే డియర్ కామ్రేడ్ చిత్రంలో విజయదేవరకొండ సరసన నటిస్తున్నది. గీతా గోవిందం తర్వాత వరుసగా మరోసారి ఆయనతో జతకట్టింది.

Have a great day!
Read more...

English Summary

Rashmika Mandanna’s mother Suman Mandanna confirms calling off engagement with Rakshit Shetty. The two fell in love on the sets of their hit film, Kirik Party, and then got engaged in July 2017. Report suggest that Rashmika has reportedly broken up with Rakshit. In this event, Rakshit Shetty emotionally posted a letter to protect Rashmika Mandanna. Now, Rashmika spoke to media and told that dont believe in rumours.