Maa Inti Bangaaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడంతో మూవీ మేకర్స్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఓ లేడీ ఓరియెంటెడ్ స్టోరీతో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న తొలి సినిమాగా 'మా ఇంటి బంగారం నిలిచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సమంత చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ పోస్టులో సినిమా విడుదలకు ముందు తాను ఎదుర్కొన్న సందేహాలను, లేడీ ఓరియంట్ సినిమాపై ఇండస్ట్రీలో ఉన్న అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నారు. మా ఇంటి బంగారం విడుదలకు ముందు తనను ఎక్కువగా కలవరపెట్టిన విషయం కథ అనీ, ఫలితం కాదని, అసలు 'మా ఇంటి బంగారం' గురించి ప్రేక్షకులకు తెలుసా? ప్రచారం సరైన స్థాయిలో చేరిందా? ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నారా?' అనే ప్రశ్నతన ముందుకు వచ్చాయని సమంత వెల్లడించారు.
బడా హీరోల సినిమాలకు లభించే భారీ స్థాయి ప్రచారం లేడీ ఓరియంట్ సినిమాలకు దక్కదనే భావన తనలో కూడా ఉండేదని ఆమె తెలిపారు. సినిమా విడుదలకు ముందు జరిగిన ఓ సంఘటనను కూడా సమంత గుర్తు చేసుకున్నారు. తన స్నేహితుడు ఓ బీ-సెంటర్ ఎగ్జిబిటర్‌కు ఫోన్ చేసి, "మా ఇంటి బంగారం ఎంత ఓపెనింగ్ సాధిస్తుందని అనుకుంటున్నారు?" అని అడిగారని చెప్పారు. అప్పుడు ఆ ఎగ్జిబిటర్ ఏమాత్రం సందేహం లేకుండా, "హీరోయిన్ సినిమా చూడటానికి ఎవరు వస్తారు? పెద్ద హీరో సినిమాలో హీరోయిన్‌గా ఉంటే గ్లామర్ కోసం చూస్తారు. కానీ హీరోయిన్ ప్రధాన పాత్రలో సినిమా అంటే ప్రేక్షకులు ఎందుకు వస్తారు?" అని సమాధానం ఇచ్చారని, ఆ మాటలను తాను కూడా వింటున్నానని సమంత వెల్లడించారు. ఆ కామెంట్స్ తనని బాధపెట్టినా, అదే సమయంలో ఆలోచింపజేశాయని సమంత తెలిపారు. లేడీ ఓరియెంట్ సినిమాలపై అప్పట్లో చాలా మంది దృక్పథం ఇదేనని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, "నిజమైన మార్పు రావాలంటే ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి. చాలా సందర్భాల్లో ఆ రిస్క్ ఫలించదు. కానీ అప్పుడప్పుడు మాత్రం అద్భుతాలు జరుగుతాయి. మా విషయంలో మా సినిమాలో జరిగింది" అని సమంత ఎమోషనల్ అయ్యారు. రూ.100 కోట్ల క్లబ్ లో 'మా ఇంటి బంగారం' సమంతకు సర్‌ప్రైజ్ తన పోస్టులో ఇకపై ఎవరైనా బీ లేదా సీ సెంటర్ ఎగ్జిబిటర్‌ను మహిళా ప్రధాన సినిమా గురించి అడిగితే, వెంటనే "ఆ సినిమా ఎవరూ చూడరు"అనే సమాధానం కాకుండా, "చూద్దాం... ఎలా ఆడుతుందో" అనే సమాధానం రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే ఒక సినిమా విజయం లేదా పరాజయాన్ని ముందుగానే ఎవరూ నిర్ణయించలేరని ఆమె అభిప్రాయపడ్డారు.
'మా ఇంటి బంగారం' సినిమా జూన్ 19న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. విడుదలైన 24 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. ఇలా తెలుగులో రూ.100 కోట్ల మార్కును అందుకున్న తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో హీరోలకే భారీ మార్కెట్ ఉంటుందనే అభిప్రాయాన్ని సమంత చెదరగొట్టారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
సినిమా రూ.100 కోట్ల మైలురాయిని దాటిన సందర్భంగా మూవీ మేకర్స్ సమంతకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చింది. కలెక్షన్ల వివరాలు తెలియజేస్తూ రూపొందించిన ప్రత్యేక వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె ఎమోషనల్ రియాక్షన్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా, లేడీ ఓరియెంట్ సినిమాల విజయంగా చూడాలని ఆమె కోరుకున్నారు.More Articles