అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండేందుకు వీలుగా ఇటీవలికాలంలో సెలబ్రిటీలంతా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఖాతాలు తెరుస్తున్నారు. తమ సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు. అలాగే వీలు కుదిరినప్పుడల్లా ఇన్ స్టా లైవ్ లోకి వస్తుంటారు. అయితే కొందరు ఆకతాయిలు ఈ లైవ్‌లోకి వచ్చి అసభ్య పదజాలంతో కామెంట్స్ చేయడం, దూషించడం వంటి పనులతో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కొందరు వీటిపై స్పాట్‌లోనే మండిపడుతుంటే.. మరికొందరు మాత్రం వదిలేస్తున్నారు. తాజాగా ఇలాంటి వారికి బాధితురాలిగా మారారు నటి శ్రియా శరణ్. ఈ వివరాల్లోకి వెళితే..

Advertisement

ఒకప్పుడు తన అందం, అభినయంతో దక్షిణాదిని ఒక ఊపు ఊపి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు శ్రియా శరణ్. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. 2001లో వచ్చిన ఇష్టం మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా శ్రియా అందం, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వేనువ్వే, ఠాగూర్, నేనున్నాను, బాలు, ఛత్రపతి తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందరు అగ్రనటులతో కలిసి నటించారు.

Advertisement

సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపారు. తన డ్యాన్స్, అందంతో అప్పట్లోనే ఐటెం సాంగ్స్‌తో ఒక ఊపారు శ్రియా శరణ్. ఆమె వేసిన బాటలోనే ఇప్పుడు తమన్నా, కాజల్, శృతిహాసన్ వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రష్యాకు చెందిన ఆండ్రే కొశ్చీవ్‌తో డేటింగ్ చేసి 2018 మార్చి 12న అతనిని పెళ్లి చేసుకున్నారు శ్రియా. ఈ దంపతులకు ఒక పాప.

రీ ఎంట్రీలోనూ తన ఇమేజ్‌కి తగిన పాత్రలు చేస్తూ దూసుకెళ్తున్నారు శ్రియా శరణ్. మిరాయ్, సందక్కరి తదితర సినిమాలలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం తమిళంలో నాన్ వయలెన్స్, హిందీలో దృశ్యం 3 సినిమాలో శ్రియా నటిస్తున్నారు. సినిమాలతో పాటు షో టైమ్, స్పెస్ జెన్: చంద్రయాన్ తదితర వెబ్ సిరీస్‌లలో అలరించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శ్రియా ఈ వయసులోనూ హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో అలరిస్తుంటారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఏనాడూ ఏ వివాదం జోలికి శ్రియా వెళ్లకుండా తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు, కామెంట్స్‌కు సమాధానం ఇస్తూ ఉంటారు శ్రియా. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమాని దారుణమైన ప్రశ్న అడగటంతో దానికి శ్రియా భర్త కౌంటర్ ఇచ్చారు.

Advertisement

మీ ఎద భాగం బాగుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో దానికి ఇడియట్స్ అంటూ శ్రియా ఫైర్ అయ్యారు. అయితే మీ వాదనతో నేను కూడా ఏకీభవిస్తానని శ్రియా భర్త ఫన్నీగా కౌంటర్ వేశారు. అలాగే శ్రీయా ఎద భాగంపై ఇంకా కామెంట్ చేయండి అన్నారు. అయితే శ్రియా మాత్రం చెత్త మనుషులు అంటూ అసహనం వ్యక్తం చేశారు. మరో కామెంట్‌లో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరిద్దరూ ముద్దు పెట్టుకోవాలని జనం కోరుకుంటున్నారు? మనిద్దరం ఫ్రెండ్‌షిప్ చేయగలమా అని అడగటంతో సో క్యూట్ అంటూ శ్రియా సిగ్గుపడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... శ్రియాను కామెంట్ చేసినవారిపై నెటిజన్లు మండిపడుతున్నారు.