తెలుగు సినిమా పరిశ్రమలో మరో కంటెంట్ ప్రధానంగా, భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం రాజా The రాజా. ఈ చిత్రంలో యువ హీరో, హీరోయిన్లు రుత్విక్, విశాఖ ధీమాన్ జంటగా నటించారు. డాక్టర్ నరేష్, విజయ్ కృష్ణ, అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓఐ, పార్వతీశం, రాజశ్రీ నాయర్, రోహిణి, భద్రం, మైమ్ మధు, ఆనంద్ తదితరులు నటించారు. విృంధావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు నిహారిక దాసరి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు అనిల్ బోయిడపు దర్శకత్వం వహించారు. కే శ్రీలతా రెడ్డి సమర్పించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..సినిమాటోగ్రఫి: రవికిరణ్ బోయిడపు, మ్యూజిక్: మార్క్ కే రాబిన్, ఎడిటర్: సాయిబాబు తలారీ, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, ఆర్ట్ డైరెక్టర్: విజయ్ కుమార్ పసుపులేటి తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూలై 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి నిర్మాత నిహారిక, హీరో రుత్విక్ మాట్లాడుతూ..
నిర్మాతగా మాకు రాజా The రాజా తొలి సినిమా. అనేక రకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. సినిమా నిర్మాణంలో చాలా పాఠాలు నేర్చుకొన్నాం. మాకు మంచి నాలెడ్జ్ వచ్చింది. మరో సినిమా ఎలా తీయవచ్చో అని తెలుసుకొన్నాం. ముఖ్యంగా టెక్నిషియన్స్‌ను, ఆర్టిస్టులను ఎలా డీల్ చేయాలో అనుభవం వచ్చింది అని నిహారిక తెలిపారు. మగధీర తరహా షేడ్స్ ఉన్న సినిమా. యాక్టర్లకు మంచి స్కోప్ ఉన్న చిత్రం. అందుకే బడ్జెట్ పరంగా ఆలోచించలేదు. నా తమ్ముడు రుత్విక్ టాలెంట్‌పై నమ్మకం కారణంగానే భారీగా ఖర్చు చేశాం. ఈ చిత్రంలో నరేష్, మంజు భార్గవి, రోహిణి లాంటి సీనియర్లు నటించారు. సినిమా నిర్మాణం అనే సరికి ఫ్యామిలీ మెంబర్స్ వద్దని వారించారు. కానీ మాకు కథ, కథనాలపై నమ్మకంతోనే ఈ సినిమాను నిర్మించాం అని నిహారిక తెలిపారు. రాజా ది రాజా సినిమా బిజినెస్ చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఓటీటీ బిజినెస్ లాక్ కాలేదు. టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ తర్వాత సినిమాపై అన్ని వర్గాల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వస్తున్నది. సినిమా రిలీజ్ తర్వాత టాక్ ఎలా ఉంటుందనే క్యూరియాసిటీ ఉంది. సినిమా నిర్మాణంలో మహిళలు రావడమనేది పెద్ద ఛాలెంజ్ అనిపించింది అని నిహారిక తెలిపారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రి, కొడుకుల మధ్య మానసిక, భావోద్వేగమైన సంఘర్షణ. ఓ యువకుడు తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో తండ్రికి కొడుకు మధ్య జరిగే చిన్న కాన్‌ప్లిక్ట్ ఉంటుంది. ఇలాంటి సమస్య మధ్య ఎలా తన లక్ష్యాన్ని సాధించాడు. ఎలాంటి అతడి జీవితం ఎలాంటి మలుపు చోటు చేసుకొన్నాయి అనేది సినిమా కథ. రాజుల కాలం కథ, సోషల్ డ్రామాతో ఈ సినిమా రూపొందింది. పిరియాడిక్ నేచర్ ఉన్న కథనే ఈ సినిమాలో ప్రధానమైన ట్విస్ట్. సినిమా ఇండస్ట్రీలో రాజా ది రాజా అంటే నాకు మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి అని హీరో రుత్విక్ తెలిపారు.