టైం చూసి కొట్టిన నాగ్, నాని.. మణిశర్మ జూలు విదిల్చాడు.. మెగాస్టార్ సాంగ్‌కు రీప్లేస్‌మెంట్!


Laka Laka Lakumeekara Lambodara From Devadas Right On Time

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్ అంచనాలు పెంచేస్తోంది. ఈ నెలాఖరులో దేవదాస్ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, పాటలు, టీజర్ తో ప్రమోషన్స్ వేగం పెంచారు. అన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన సంగీతానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజగా గణేష్ చతుర్థిని పురస్కరించుకుని ఓ పాటని విడుదుల చేసారు.

దేవుళ్ళ పాటల స్పెషలిస్ట్

దేవుడిపై పాటలు కంపోస్ చేయడంలో మణిశర్మకు మణిశర్మే సాటి అని మరో మారు రుజువైంది. ఇంద్ర చిత్రంలో శివుడిపై, జై చిరంజీవ చిత్రంలో గణేష్ పై రూపిందించిన సాంగ్స్ ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

13 ఏళ్ల నుంచి అదే పాట

2005 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన జైచిరంజీవ చిత్రం విడుదలయింది. ఆ చిత్రాల్లో గణేష్ సాంగ్ ఎంత సూపర్ హిట్టో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 13 ఇళ్లనుంచి ఎక్కడ గణేష్ ఉత్సవాలు జరిగినా అదే సాంగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సాంగ్ కు రీప్లేస్ మెంట్ ని మళ్ళీ మణిశర్మే సృష్టించాడు.

ఊర మాస్ అనిపించేలా

నాగ్, నాని నటిస్తున్న దేవదాస్ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు వినాయక చవితి సందర్భంగా నేడు ఈ చిత్రంలో గణేష్ సాంగ్ ని విడుదల చేశారు. సాంగ్ ఊరమాస్ బీట్ తో వినగానే ఎక్కేసేలా ఉంది. ఇకపై ఎక్కడ గణేష్ ఉత్సవాలు జరిగినా ఈ పాటే వినిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

టైం చూసి కొట్టారు

ఈ సాంగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సరైన సమయంలో ఈ పాటని విడుదుల చేశారు. లిరికల్ సాంగ్ లో ఈ పాటకు సంబందించిన స్టిల్స్ చూపించారు. నాగార్జున, నాని మాస్ లుక్ లో అదరగొడుతున్నారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి. ఈ పాట దేవదాస్ చిత్రానికి మంచి ప్రచారంగా మారుతుంది.

Have a great day!
Read more...

English Summary

Mani Sharma strikes with energetic Ganesh Song. Nagarjuna, Nani Multistarrer movie will release on sep 27th