మా కోడలు గిన్నిస్ రికార్డ్ కోసం ట్రై చేస్తున్నట్లుంది.. నాగార్జున!


స్టార్ హీరోయిన్ సమంత మరో మారు తన నటనతో అబ్బురపరచడానికి సిద్ధం అవుతోంది. సమంత నటించిన థ్రిల్లర్ చిత్రం యూ టర్న్ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. యూ టర్న్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాలతో ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు కూడా రేపే విడుదలవుతుండడం విశేషం. తాజగా జరిగిన యూ టర్న్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడారు.

పవన్ కుమార్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తరువాత మరో యు టర్న్ తీసుకుని కెరీర్ లో ఎదుగుతావని నాగార్జున దర్శకుడి ఉద్దేశించి అన్నారు. పేక్షకుల్లో ఈ చిత్రం చూడాలనే ఆసక్తి ఉందని అన్నారు.

ఈ చిత్ర త్రిట్రైలర్ విడుదలైన సమయంలో రెస్పాన్స్ ఎలా ఉందని ఫోన్ చేసి సమంతని అడిగా. పరిగెత్తుకుని ఇంటికి వచ్చి కథ మొత్తం చెప్పిందని నాగార్జున సరదాగా వ్యాఖ్యానించారు.

ఇటీవల సమంత ఎంచుకుంటున్న కథలు అద్భుతంగా ఉన్నాయని నాగార్జున అన్నారు. రంగస్థలం చిత్రంలో సమంత చాలా అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. మరి కొన్ని చిత్రాలకు కూడా విజయం సాధించాయని అన్నారు.

ఈ చిత్రానికి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారని విన్నా. కర్మ సాంగ్ రూపొందించిన విధానం అద్భుతం అని నాగార్జున అన్నారు. ఈ సినిమా కోసం ఖర్చుపెట్టిందంతా తిరిగి వస్తుందని తెలిపారు.

మా కోడలు సమంత గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని నాగార్జున చమత్కరించారు. యూ టర్న్ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదలవుతోంది. అదే సమయంలో తమిళంలో సమంత నటించిన సీమరాజ చిత్ర విడుదల కూడా రేపే. మరోవైపు నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా విడుదలవుతోంది. ఈ నెలలోనే తాను నటించే దేవదాస్ చిత్రం కూడా విడుదలవుతోందని నాగార్జున అన్నారు. ఈనెల అక్కినేని ఫ్యామిలీకి కలసి వస్తుందని అన్నారు.

Have a great day!
Read more...

English Summary

Nagarjuna speech at Samantha's Uturn pre release event. U turn releasing tomorrow