పవన్ కళ్యాణ్ హీరోయిన్‌కు ఎన్ని కష్టాలో.. 7 ఏళ్ల కొడుకు చేసిన పని, పోలీస్ స్టేషన్‌‌లో పంచాయతీ!


Preeti Jhangiani' Incident With His Son

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ తమ్ముడు చిత్రంలో నటించిన ప్రీతి జింగనియా గుర్తుందా.. ఆ చిత్రంలో సాఫ్ట్ రోల్ లో నటించిన ప్రీతీ తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ఆ తరువాత కొన్ని తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా నటించింది. 2008 లో వ్యాపారవేత్త ప్రవీణ్ దబాస్ ని వివాహం చేసుకుని ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ప్రస్తుతం ఎదుగుతున్న తన 7 ఏళ్ల కొడుకు చేసే పనులకు పురాణాల్లో కృష్ణుడి వలన యశోదకు ఎదురైన చిక్కులు ఎదురవుతున్నాయంట.

కృష్ణుడు చేసే అల్లరి పనులకు ఇరుగు పొరుగువారి వద్ద యశోద మాటలు పడాల్సి వచ్చెదనని పురాణాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు ఇదే పరిస్థితి ప్రీతీ జింగనియాకు ఎదురవుతోంది.

ప్రీతి జింగనియా ఏడేళ్ల కుమారుడి పేరు జయవీర్. జయవీర్ తన అపార్ట్ మెంట్ లో స్నేహితులతో కలసి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అపార్ట్ మెంట్ లో ఉన్న జయవీర్ తన స్నేహితులతో కలసి ఫుట్ బాల్ ఆడుతుండగా ఒక స్నేహితుడితో గొడవ అయింది. ఇద్దరూ కలసి పోట్లాటకు సైతం దిగారు.

అవతలివాడి తాత ఎంటర్ అయి జయవీర్ ని నోటికి వచ్చినట్లు తిట్టినట్లు తెలుస్తోంది. వాచ్ మెన్ ని పిలిచి వీడికి బయటకు గెంటేయాలని కూడా బెదిరించాడట. ఈ విషయం ప్రీతీ జింగనియాకు తెలియడంతో మ్యాటర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

చిన్న పిల్లల గొడవలో తలదూర్చి, తన కుమారుడిని నోటికి వచ్చినట్లు దూషించిన ఆ పెద్దాయనకు బుద్ది చెప్పాలని ప్రీతి నిర్ణయించుకుందట. వెంటనే తన కొడుకుని వెంటబెట్టుకుని కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

పోలీసులు ఇరు కుటుంబ సభ్యులని పిలిపించి సమస్యని సున్నితంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. ఇవి కొడుకు వలన ప్రీతి ఎదుర్కొంటున్న చిక్కులు. తమ్ముడు చిత్రంతో విజయాన్ని అందుకుని ప్రీతీ ఆ తరువాత హిందీ చిత్రాలతో బిజీ అయింది. అప్పుడప్పుడూ తెలుగులో కూడా మెరిసింది.

Have a great day!
Read more...

English Summary

Preeti Jhangiani's 7-Year-Old Son Abused And Threatened By Senior Citizen. Preeti Jhangiani became papular with Tammudu movie