రాహుల్ రామకృష్ణ మరో ఘనత.. అర్జున్‌రెడ్డి, గీతా గోవిందం క్రేజ్‌తో..


Rahul Ramakrishna Plays A Lead Role In Sundeep Kishan's Film

అర్జున్‌రెడ్డి చిత్రంతో సినీ పరిశ్రమలోకి దూసుకొచ్చిన తారల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. ఆ చిత్రంలో హాస్యాన్ని, ఎమోషన్‌ను మేళవించి నటించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. వైద్య విద్యార్థిగా, అర్జున్‌రెడ్డి స్నేహితుడిగా తెరపైన బీహేవ్ చేసిన తీరుతో అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత భరత్ అనే నేను, చిలసౌ చిత్రాల్లోని నటన ఆయన ప్రతిభకు అద్దం పట్టింది. టాలీవుడ్‌ ప్రేక్షకులను తనదైన నటనతో ఆకట్టుకొంటున్న రాహుల్ తాజాగా మరో ఘనతను సాధించాడు.

తమిళ పరిశ్రమలోకి

టాలీవుడ్‌లో ప్రభావవంతమైన పాత్రలతో కనిపిస్తూ మెప్పిస్తున్న రాహుల్ ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. సందీప్ కిషన్‌తో దర్శకుడు కార్తీక్ రాజు రూపొందిస్తున్న చిత్రంలో వెన్నెల కిషోర్‌తో కలిసి ఓ కీలకపాత్రను పోషించాడు.

సందీప్ కిషన్ సినిమాలో

తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నానని చెబుతూ రాహుల్ రామకృష్ణన్ ట్వీట్ చేశారు. సందీప్, కిషన్, కార్తీక్ రాజు కాంబినేషన్‌లో వస్తున్న చిత్ర షూటింగ్ పూర్తయింది అని తెలిపారు.

నా పాత్ర కొత్త అనుభూతికి

ఇంకా పేరు పెట్టని సినిమాలోని నా పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను అని రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

గీతా గోవిందంలో ఆకట్టుకునే పాత్రలో

ఇటీవల రిలీజై ఘన విజయం సాధించిన గీతా గోవిందం చిత్రంలో ముఖ్య పాత్రలో రాహుల్ కనిపించారు. సినిమాకు ఆయన పాత్ర వెన్నముకగా నిలువడమే కాకుండా కథను నడిపించే పాత్రలో కనిపించాడు. విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా ఆయన పాత్రకు మంచి ఆదరణ లభించింది.

Have a great day!
Read more...

English Summary

Rahul Ramakrishna is making his debut in Tamil with the directorial venture of Caarthik Raju, which has Sundeep Kishan in the lead role. The actor has wrapped up his portion in the film and has said that his role will surprise the audience.