శైలజారెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ బిజినెస్.. చైతు ముందు బిగ్ టాస్క్!


Shailaja Reddy Alludu Pre Release Business

అక్కినేని నాగ చైతన్య నటించి శైలజారెడ్డి అల్లుడు చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా యంగ్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నటించింది. రమ్యకృష్ణ అత్త పాత్రలో నటించిన ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తిని నెలకొని ఉంది. దర్శకుడు మారుతి వినోదాత్మక అంశాలతో ఈ చిత్రాన్ని తెరక్కించాడు. అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురువారం రోజు వినాయక చవితి కానుకగా భారీ విడుదలకు రంగం సిద్ధం అయింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిద్దాం.

శైలజారెడ్డి అల్లుడు పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని పాజిటివ్ అంశాలతో ఈ చిత్రం విడుదల కాబోతోంది. నాగ చైతన్య కెరీర్ భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రం ఇదే అని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది.

ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 25 కోట్లవరకు జరిగింది. నాగ చైతన్య కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ నంబర్ అని చెప్పొచ్చు. కొన్ని ఏరియాలలో ఊహించిన మొత్తం కంటే ఎక్కువగా బిజినెస్ జరిగింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలంటే 30 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది.

నైజం ఏరియాలో మాత్రమే శైలజారెడ్డి అల్లుడు థియేట్రికల్ రైట్స్ 6.5 కోట్లకు అమ్ముడయ్యాయి. సీడెడ్ లో 3.25 కోట్లు, ఈస్ట్ లో ఒకటిన్నర కోటివరకు బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ లో 3. 5 కోట్లకు బిజినెస్ జరిగింది.

నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత నటించిన యుద్ధం శరణం చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో శైలజారెడ్డి అల్లుడు చిత్రంపై చైతు ఆశలు పెట్టుకుని ఉన్నాడు. మారుతి దర్శత్వం వహించిన సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది.

Have a great day!
Read more...

English Summary

Shailaja reddy Alludu Pre Release Business. Big task for NagaChaitanya