చార్మింగ్ గర్ల్‌తో సచిన్ టెండూల్కరన్ రొమాన్స్.. వారిని కలిపింది ఆయనే.. శ్రీరెడ్డి


Sri Reddy Comments On Sachin Tendulkaran...?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ప్రముఖుల పేర్లను మీడియాలోకి లాగుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తమిళ పరిశ్రమలో లారెన్స్ రాఘవపై ఇటీవల వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరును లాగేందుకు ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. సచిన్, అతనికి సలహాదారుడిగా వ్యవహరించే చాముండేశ్వరి నాథ్‌ పేర్లను పోలిన విధంగా పరోక్షంగా పేర్లను ఉపయోగిస్తూ వ్యాఖ్యలు చేయడం మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. అసలే కామెంట్ చేసిందంటే..

సచిన్ టెండూల్కరన్ అనే రొమాంటిక్ వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కలిశాడు. అతడితో ఓ చార్మింగ్ అమ్మాయితో రొమాన్స్ చేసింది అంటూ కామెంట్ పెట్టింది. దాంతో ఈ పోస్ట్ మీడియాలో హల్‌చల్ రేపుతున్నది.

రొమాంటిక్ అబ్బాయిని, చార్మింగ్ గర్ల్‌ను కలిపింది హై ప్రొఫైల్ వ్యక్తి చాముండేశ్వరి స్వామి. ఆయన మధ్యవర్తిగా వ్యవహరించాడు అని కామెంట్‌లో పేర్కొన్నది. ఛార్మింగ్ గర్ల్ అంటే తన పేరా లేక.. టాలీవుడ్‌కు చెందిన మరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అనే విషయంపై క్లారిటీ కనిపించడం లేదు.

గొప్ప వ్యక్తులు గొప్పగా రొమాన్స్‌‌ను బాగా ఆడుతారు అని సెటైర్ వేసింది. ఇలా సచిన్ టెండూల్కరన్, చాముండేశ్వరీ స్వామి అంటూ పేర్లను మీడియాలోకి లాగడంపై వివాదంగా మారే ముప్పు కనిపిస్తున్నది. ఇందులో వాస్తవమెంతా? బ్లాక్‌మెయిల్ చేయడానికే శ్రీరెడ్డి ఇలాంటి కామెంట్లు పెడుతున్నాదా అనే అంశాలపై చర్చ జరుగుతున్నది.

టాలీవుడ్‌ సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని పెద్దలపై కామెంట్లు చేస్తున్నది. తాజాగా కోలీవుడ్‌ మీడియాను, సెలబ్రిటీల కంటిపై నిద్ర లేకుండా చేస్తున్నదనే మాట వినిపిస్తున్నది.

క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేస్తున్న శ్రీరెడ్డిపై జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా దృష్టిపెట్టింది. ప్రస్తుతం శ్రీరెడ్డి జీవిత కథ ఆధారంగా రెడ్డీ డైరీస్ అనే సినిమా తెరకెక్కుతున్నది. ఇంకా కొందరు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు శ్రీరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు.

Have a great day!
Read more...

English Summary

Actor Srireddy fighting against Casting couch in South Film Industry. She alleges Raghava Lawrence due to sexual favours. In this situation, She got a message from unknown person that.. Raghava Lawrence appeared staying in Chennai Resorts with 10 Girls. Recently Srireddy tweeted that.. A romantic guy called sachin tendulkaran,when he came to Hyderabad, charmi'ng girl did a romance wt him..high profile chamundeswar swami is a middle person..greatest persons can play well i mean romance well ????