ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా శ్రీరెడ్డి తన అసభ్యకరమైన ఆరోపణలు మాత్రం మానుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందిన శ్రీరెడ్డి ఆతరువాత తీవ్ర విమర్శల పాలైంది. నాని, లారెన్స్, మరికొందరు దర్శకులు, నిర్మాతలపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. రాను రాను శ్రీరెడ్డి ఆరోపణలు పరాకాష్టకు చేరుతున్నాయి. పవన్ కళ్యాణ్ తల్లిని అనరాని మాటలతో దూషించిన శ్రీరెడ్డి ఇటీవల క్రికెట్ దేవుడు సచిన్ వ్యక్తిత్వాన్ని సైతం కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి కామెంట్స్ పై మీడియాలో చర్చ జరుగుతుండగా మరో మారు తన నోటికి పని చెప్పింది. ఈ సారి టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావుని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గామారింది.
శ్రీరెడ్డి చేస్తున్న అసభ్యకర ఆరోపణలు ఇక ముగింపు ఉందా లేదా అనే చర్చ సగటు సినీ అభినుల్లో జరుగుతోంది. కాస్టింగ్ కౌచ్ అంటూ మీడియా ముందుకు వచ్చి, పవన్ కళ్యాణ్ పై ఆరోపణలతో పబ్లిసిటీ పొందిన శ్రీరెడ్డి ఏ విషయంలోనూ చట్టాలని, న్యాయస్థానాలని మాత్రం ఆశ్రయించడం లేదు.
క్రికెట్ దేవుడు సచిన్ గురించి కూడా శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. చార్మింగ్ గర్ల్ తో రొమాన్స్ అంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా మీడియాలో సంచలనంగా మారాయి.
టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు రాఘవేంద్ర రావు గురించి శ్రీరెడ్డి తాజాగా సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాఘవేంద్ర రావు టాలీవడ్ లో మోస్ట్ రొమాంటిక్ దర్శకుడు. రొమాంటిక్ దర్శకులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్.
రాఘవేంద్ర రావు తన చిత్రాల్లో హీరోయిన్లని అందంగా చూపిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని ఘాటుగా చెబుతూ సంచలన ఆరోపణలు చేసింది. హీరోయిన్ల అందాలు పిండుకునే దర్శకుడు ఆయనే అంటూ అసభ్యంగా కెమెంట్ చేసింది.
హీరోయిన్ ని ఏ యాంగిల్ లో చూపించాలో ఆయనకు బాగా తెలుసు. అందుకే మనం ఆ దర్శకుడికి హిట్స్ అందించాం అంటూ శ్రీరెడ్డి ఈ సారి రాఘవేంద్ర రావుపై పడింది. శ్రీరెడ్డి తన ఆరోపణల పర్వాన్ని ముగించే మూడ్ లో లేనట్లు స్పష్టం అవుతోంది.