Michael OTT Release: ప్రపంచవ్యాప్తంగా పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్.. ఈ లెజెండరీ సింగర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హాలీవుడ్ బయోపిక్ 'మైఖేల్'. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా త్వరలోనే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా డిజిటల్ విడుదల సిద్దమైంది. ఇంతకీ మైఖేల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నదంటే?

Advertisement
Advertisement

బయోపిక్‌లలో కొత్త రికార్డు
బయోపిక్ గా తెరకెక్కిన సినిమాల్లో 'మైఖేల్' కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ఈ మూవీని హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించారు. సాధారణంగా బయోపిక్ సినిమాలకు పరిమిత మార్కెట్ ఉంటుందని భావిస్తారు. కానీ ఈ సినిమా ఆ అంచనాలను పూర్తిగా తలకిందులు చేసింది. సినిమా కథ మాత్రమే కాదు.. సంగీతం, డ్యాన్స్, ఎమోషన్స్, విజువల్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంగీత అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించడంతో రికార్డు స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి.

Advertisement

ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించారు. మైఖేల్ జాక్సన్ హావభావాలు, డ్యాన్స్ స్టెప్స్, మూన్‌వాక్, స్టేజ్ ప్రెజెన్స్‌ను అచ్చుగుద్దినట్లు అనుకరించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా మూన్‌వాక్, లైవ్ పెర్ఫార్మెన్స్ సన్నివేశాల్లో జాఫర్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. మైఖేల్ జాక్సన్‌ను మరోసారి తెరపై చూసిన అనుభూతి కలిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక మైఖేల్ తండ్రి జో జాక్సన్ పాత్రలో కోల్‌మన్ డొమింగో నటించారు. తల్లి కేథరిన్ జాక్సన్ పాత్రలో నియా లాంగ్ నటించారు.

Advertisement

ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన 'మైఖేల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుత స్పందన అందుకుంది. ప్రారంభ రోజుల్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, మైఖేల్ జాక్సన్‌కు ఉన్న అపారమైన అభిమానగణం కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఒక బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. అంటే సుమారు రూ.9500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రపంచ సినిమా చరిత్రలో బిలియన్ డాలర్ క్లబ్‌లో చేరిన తొలి హాలీవుడ్ బయోపిక్ గా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది.

Advertisement

ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, బుక్ మై షో స్ట్రీమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే వీక్షించాలంటే రూ.119 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లకు అదనపు రెంటల్ ఛార్జీలు లేకుండా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో మరింత మంది ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉంది.

Advertisement

ఈ బయోపిక్ ఆగస్టు 29 నుంచి జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. దీంతో భారతీయ ప్రేక్షకులు కూడా మైఖేల్ జాక్సన్ జీవితాన్ని మరోసారి ఆస్వాదించే అవకాశం పొందుతున్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న 'మైఖేల్' ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో వేచి ఉండాలి.