విరాట్ కర్ణ, నభా నటేష్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ నాగబంధం. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధి, అక్కడి నాగబంధం, బ్రహ్మకమలం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా జూలై 3న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగబంధం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఎవరు దక్కించుకున్నారు? ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? అనేది పరిశీలిస్తే..

Advertisement

నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డిలు నాగబంధం మూవీని నిర్మించారు. ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, మహేశ్ మంజ్రేకర్, జగపతి బాబు, అనసూయ, మురళీ శర్మ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఎస్ సౌందర్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. జునైద్ కుమార్, అభిలు సంగీతం అందించారు. ఆర్‌సీ ప్రణవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.

Advertisement

నాగబంధం బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి నాగబంధం మూవీని దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించారు. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌తో పాటు పద్మనాభ స్వామి ఆలయం, హిమాలయాల సెట్టింగుల కోసం భారీగా ఖర్చుపెట్టి గ్రాండియర్ లుక్ తీసుకొచ్చారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. థియేట్రికల్ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం రైట్స్ 9 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 14 కోట్ల రూపాయలు, సీడెడ్ రైట్స్ 4 కోట్ల రూపాయలు చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది.

Advertisement

నాగబంధం బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక రైట్స్ 2.7 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 70 లక్షల రూపాయలు చొప్పున జరిగింది. నార్త్ ఇండియా, ఓవర్సీస్‌లోన ఈ సినిమాను కమీషన్ బేస్ మీద జియో స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది. దాంతో మొత్తంగా నాగబంధంకు వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విరాట్ కర్ణ మూవీ బ్రేక్ఈవెన్ కావాలంటే బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

Advertisement

నాగబంధం ఏ ఓటీటీలో అంటే?
నాగబంధం మూవీకి థియేట్రికల్ బిజినెస్‌తో పాటు నాన్ థియేట్రికల్ పరంగానూ మంచి బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ విషయానికి వస్తే తెలుగులో నాగబంధం శాటిలైట్ రైట్స్‌ని స్టార్ మా సొంతం చేసుకుంది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల శాటిలైట్ రైట్స్‌ని జీ స్టూడియోస్ దక్కించుకుంది. మొత్తంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ రూపంలో నాగబంధం మూవీ 40 కోట్ల రూపాయలు ఆర్జించింది.

Advertisement

నాగబంధం స్ట్రీమింగ్ ఎప్పుడు?
థియేటర్‌లో రిలీజైన 4 నుంచి 6 వారాల తర్వాత నాగబంధం మూవీ ఓటీటీలోకి రావాలనే ఒప్పందం మీద ఈ డీల్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి ఆగస్ట్ రెండో వారంలో నాగబంధం మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌ను బట్టి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ముందుకు జరగొచ్చు లేదంటే ఆలస్యం కావొచ్చు. నాగబంధం ఓటీటీ రిలీజ్‌పై అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.