OTT Releases This Week: ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా అలరించడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్దమయ్యాయి. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ+, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ వేదికలు సిద్దమయ్యాయి. ఓటీటీలో జూలై 13 నుంచి జూలై 19 వరకు పలు భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రియాలిటీ షోలు స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత నటించిన 'మా ఇంటి బంగారం' డిజిటల్ ఎంట్రీ ఇవ్వడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
థియేటర్లలో..
ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. అయితే.. ముఖ్యంగా మూడు సినిమాలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. జూలై 16న జోజు జార్జ్ నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'వరవు', తిరువీర్-ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తెలుగు రొమాంటిక్ కామెడీ 'ఓ సుకుమారి' విడుదల కానున్నాయి. ఇక జూలై 17న ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో రూపొందిన పాన్ ఇండియా బయోపిక్ 'జీడీఎన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. భారత ప్రముఖ ఆవిష్కర్త జీ.డి. నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో సత్యరాజ్, ప్రియమణి, వినయ్ రాయ్, తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించగా.. కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించారు.
సమంత 'మా ఇంటి బంగారం' డిజిటల్ ఎంట్రీ రమ్యకృష్ణ 'సెకండ్ లవ్' నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లైనప్ ఇక రొమాంటిక్ సిరీస్ 'హార్ట్‌స్టాపర్ ఫరెవర్' ఈ వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే మూడు సీజన్లతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ రొమాంటిక్ సిరీస్‌కు ఇది చివరి భాగం. ఈ లాస్ట్ పార్ట్ జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలాగే కొరియన్ హారర్ డ్రామా 'ది ఈస్ట్ ప్యాలెస్', 'స్పూకీ ఇన్ లవ్' కూడా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రైమ్ వీడియోలో యాక్షన్, ట్రూ క్రైమ్ జియోహాట్‌స్టార్‌లో జీ5లో 'ది డెవిల్'
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, తెలుగు సినీ చరిత్రలో 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇలాంటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా జూలై 17 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, ఎమోషన్, కుటుంబ బంధాలతో సాగిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓటీటీ లో అడుగుపెట్టారు. జూలై 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో తమిళ డేటింగ్ రియాలిటీ షో 'సెకండ్ లవ్' స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ రియాలిటీ షోకు నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో గతంలో ప్రేమలో విఫలమైన ఆరు జంటలు పాల్గొంటారు. వారికి మరోసారి ప్రేమలో పడే అవకాశాన్ని కల్పించే కాన్సెప్ట్‌తో ఈ షో రూపొందింది. బిగ్‌బాస్ ఫేమ్ శృతికా అర్జున్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ వారం నెట్‌ఫ్లిక్స్ కూడా ఇంటర్నేషన్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ ఫెరెల్ ప్రధాన పాత్రలో నటించిన 'ది హాక్'అనే కామెడీ సిరీస్ జూలై 16న విడుదల కానుంది. ఒకప్పుడు నంబర్ వన్ గోల్ఫర్‌గా ఉన్న వ్యక్తి మళ్లీ తన కెరీర్‌ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నమే ఈ స్టోరీ లైన్.
ప్రైమ్ వీడియోలో 'రైడ్ ఆర్ డై' అనే యాక్షన్ కామెడీ సిరీస్ జూలై 15న విడుదల కానుంది. మాజీ అసాసిన్ జీవితం, స్నేహం, యాక్షన్‌తో ఈ కథ సాగుతుంది. అలాగే అమెరికాలో సంచలనం సృష్టించిన హత్యల కేసుల ఆధారంగా రూపొందిన 'మర్డర్ 101'డాక్యుమెంటరీ సిరీస్ కూడా జూలై 13 నుంచే అందుబాటులోకి రానుంది.
జియోహాట్‌స్టార్‌లో 'వుదరింగ్ హైట్స్' జూలై 13 నుంచి ఇంగ్లీష్, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎమిలీ బ్రోంటే క్లాసిక్ నవల ఆధారంగా రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామా అభిమానులను ఆకట్టుకునే అవకాశముంది. అలాగే 'రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్' జూలై 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హారర్, థ్రిల్లర్ జానర్ అభిమానులకు ఇది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి.
కన్నడలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ డ్రామా 'ది డెవిల్' కూడా జూలై 13 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను వీక్షించే అవకాశం పొందుతున్నారు. ఇలా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు పుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సిద్దమయ్యాయి. ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ జాబితాను చూస్తే.. నిజంగానే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్‌అనే చెప్పొచ్చు.More Articles