Chennai Love Story Twitter Review: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం, యువ నటి శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ'. ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మణిశర్మ సంగీతం అందించగా, సాయి రాజేశ్ కథను అందించారు. రవి నంబూరి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో పాటు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందించగా, భాస్కర్ ముదావత్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పాటలకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా, జూలై 23 రాత్రి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ఒక నెటిజన్ తన ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. "చెన్నై లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ బాగుంది . నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా స్టీవెన్ శంకర్, నివి పాత్రలు మనసు దోచుకున్నాయి. సింపుల్‌గా ఉన్నా కంటెంట్‌తో కూడిన రైటింగ్ ఆకట్టుకుంది. మణిశర్మ సంగీతం మరోసారి మ్యాజిక్ చేసింది. ఫస్ట్ హాఫ్ సూపర్బ్" అంటూ ప్రశంసించాడు.
మరో నెటిజన్ తన ట్విట్టర్‌లో ఫస్ట్ హాఫ్ గురించి చెబుతూ.. " కిరణ్ అబ్బవరం ఎంట్రీ సీన్ అదిరిపోయింది. శ్రీ గౌరీ ప్రియ కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తం థియేటర్‌ను సినిమాతో కనెక్ట్ చేసింది. ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అద్భుతంగా వర్కౌట్ అయింది. 'చెన్నై లవ్ స్టోరీ' బొమ్మ బ్లాక్‌బస్టర్" అంటూ ప్రశంసించాడు. More Articles