నటీనటులు: ఫాహద్ ఫాజిల్, అథర్వ, ప్రతీ ముకుందన్, కాయదు లోహర్, మాళవిక మోహనన్, తమన్ ఎస్, నిహారిక ఎన్ఎం, ఎంజెలీనా బీ, నట్టి, వీజే రక్షన్, ద్రావిడ్ సెల్వం, నటరాజన్ సుబ్రహ్మణ్యం తదితరులు
దర్శకత్వం: ఆకాశ్ భాస్కరన్
బ్యానర్: డాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్
మ్యూజిక్: తమన్ ఎస్
సినిమాటోగ్రఫి: మనోజ్ పరమహంస, సీహెచ్ సాయి
ఎఢిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
మ్యూజిక్: తమన్ ఎస్,
ప్రొడక్షన్ డిజైనర్: ఎంఆర్ కార్తీక్ రాజ్‌కుమార్
రిలీజ్ డేట్: 2026-07-10
మేనమామ (నట్టి) పెంపకంలో పెరిగిన హృదయ్ (అథర్వ) చిన్నతనం నుంచి సిగ్గు, బిడియం, మొహమాటం ఎక్కువ. స్కూల్‌లో చదువుతుండగానే సమంత ( ప్రీతీ ముకుందన్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కానీ తన మనసులోని ప్రేమను ఆమె ముందు చెప్పలేకపోవడం, ఆమె అతడికి దూరం కావడం జరుగుతుంది. ఆ తర్వాత తన స్నేహితుడు సచిన్ (తమన్) ప్రియురాలు (నిహారిక ఎన్ఎం) ఫ్రెండ్ అముద (కాయదు లోహర్)తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదలవుతుంది. కానీ తన లవ్ ప్రపోజల్‌ను చెప్పడంలో ముందు, వెనుక ఆలోచిస్తాడు. ఆ లోపే అముద కూడా హృదయకు దూరమవుతుంది. ప్రేమ పెళ్లి కుదరకపోవచ్చని అదితి (మాళవిక మోహనన్)తో పెళ్లి కుదురుతుంది. ఈ క్రమంలో పెళ్లికి ముందు అమెరికాలో నాసాలో పనిచేస్తున్న సమంతకు తన మనసులో ఉన్న ప్రేమను చెప్పాలని అక్కడికి వెళ్తాడు.
తల్లిదండ్రుల వద్ద కాకుండా మేనమామ వద్ద హృదయ్ ఎందుకు పెరిగాడు? చిన్నతనం నుంచి తన భావాలను ఇతరులను పంచుకోవడంలో ఎందుకు విఫలమవుతుంటాడు? సమంతను ప్రేమించి.. ఆ విషయాన్ని ఆమెకు చెప్పడానికి ఎందుకు సంకోచించాడు? అముదతో అఫైర్ ఎందుకు సక్సెస్ కాలేదు? అదితితో పెళ్లికి ముందు సమంతకు తన ప్రేమను ఎందుకు చెప్పాలని అనుకొన్నాడు? అదితితో పెళ్లి వ్యవహారం ఎందుకు డైలామాలో పడింది? చివరకు తనలోని లోపాన్ని హృదయ అధిగమించిండా? సమంతకు తన లవ్ ప్రపొజల్ చెప్పాడా? హృదయ లవ్ ప్రపోజల్‌కు సమంత రియాక్షన్ ఏమిటి? ఈ సినిమా కథలో ఫాహద్ ఫాజిల్ కథ ఏమిటి? అయన పాత్ర కథను ఎలా డ్రైవ్ చేసింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
దక్షిణాది సినిమా పరిశ్రమలో 26 ఏళ్ల క్రితం సంచలన విజయం సాధించిన హీరో మురళి నటించిన హృదయం సినిమా కథను స్పూర్తిగా తీసుకొని హృదయ మురళి సినిమాను రూపొందించారు. ప్రేమ కథ కొత్తదేమీ కాకున్నప్పటికీ.. స్టోరీ ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు చాలా ఫ్రెష్‌గా, నేటితరం యూత్, జెన్ జీ అభిరుచులకు తగినట్టుగా ఈ సినిమా కథ సాగుతుంది. ఫన్, ఫీల్ గుడ్ కామెడీ, లవ్ అంశాలను దర్శకుడు ఆకాశ్ భాస్కరన్ మేలవించి తెరకెక్కించిన తీరు చాలా బాగున్నాయి. అథర్వ, ప్రతీ ముకుందన్, కాయదు లోహర్, మాళవిక మోహనన్ పాత్రలను కథలో ప్లేస్ చేసిన తీరు సరికొత్తగా ఉంటాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్యారెక్టర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. స్టోరీని డ్రైవ్ చేయడానికి తమన్ క్యారెక్టర్‌ను వాడుకొన్న విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టిందనే చెప్పాలి. నటీనటులు పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. అథర్వ ఎలాంటి పాత్రలోనైనా దూరిపోయి జీవించేస్తాడనే ఇమేజ్ ఆయనకు ఉంది. ఆయనపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను చాలా సునాయాసంగా పోషించాడు. స్కూల్ విద్యార్థి, టీనేజ్ లవర్ బాయ్, ఓ కంపెనీ ఓనర్, మెచ్యురిటీ ఉన్న యువకుడిగా చాలా డెప్ట్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఇక ప్రీతీ ముకుందన్, కాయదు లోహర్ కేవలం గ్లామర్ పరంగానే కాకుండా పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు సంపాదించుకొన్నారు. మాళవిక మోహనన్ పాత్ర నిడివి తక్కువైనా.. స్టోరీకి స్ట్రాంగ్ సపోర్టుగా ఉంటుంది. చాలా ఏళ్ల తర్వాత తమన్ యాక్టర్‌గా తన అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తాడు. డబ్బింగ్ వేరే వాళ్లతో చెప్పించడం వల్ల ఆయన చేసిన పాత్రలో ఎమోషన్స్ ఎలివేట్ కాలేకపోయాయి. నట్టి, నిహారిక ఎన్ఎం తదితరులు గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఫాహద్ ఫాజిల్ గెస్ట్ పాత్రలో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాడు. కథను నడిపించే ఎలిమెంట్‌గా ఆయన క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. మేజర్‌గా తమన్ మ్యూజిక్ ఫుల్లుగా డామినేట్ చేసింది. పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్. ఆ తర్వాత మనోజ్ పరమహంస, సాయి సినిమాటోగ్రఫి బాగుంది. లోకల్ ప్రదేశాలను, అమెరికాలోని కొన్ని ప్రదేశాలను అందింగా చూపించారు. డాడన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరిపైనైనా ప్రేమ కలిగినప్పుడు దానిని నాన్చకుండా చెప్పడం ద్వారా కొన్ని అనర్ధాలకు చెక్ పెట్టవచ్చు అనే విషయం ప్రధాన అంశంగా ఉంటుంది. ఇప్పటికీ క్లాసిక్‌గా చెప్పుకొనే హృదయం సినిమా కథను ఈ తరం వారికి నచ్చేలా డిజైన్ చేశారు. ఇటీవల కాలంలో వచ్చిన మంచి ప్రేమ కథా చిత్రమని చెప్పవచ్చు. కాసేపు నవ్విస్తుంది.. మరికొంత సేపు భావోద్వేగానికి గురి చేస్తుంది. మొత్తంగా మంచి అనుభూతిని పంచుతుంది. లవ్ స్టోరీలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం చూడాలనుకొనే సినిమాల్లో ఈ మూవీని కూడా చేర్చుకోవచ్చు. డెఫినెట్‌గా ఫుల్లుగా ఎంజాయ్ చేసే అంశాలు ఎక్కువగానే ఉన్నాయి.More Articles