Rating:
2.0/5

మూవీ: జన నాయగన్
నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, బాబా భాస్కర్, రేవతి తదితరులు
దర్శకత్వం: హెచ్ వినోద్
నిర్మాతలు: వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
బ్యానర్: కేవీఎన్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2026-07-23

Advertisement

దళపతి వెట్రీ కొండాన్ (విజయ్ సేతుపతి) జైలులో శిక్ష అనుభవిస్తుండగా.. ఓ బిజినెస్‌మ్యాన్‌పై కొందరు దుండగులు హత్యాప్రయత్నానికి పాల్పడుతారు. దాంతో వెట్రీ రంగంలోకి దిగి బిజినెస్‌మ్యాన్‌ను కాపాడుతాడు. అయితే జైలులో క్రమశిక్షణతో ఉండటం వల్ల క్షమాభిక్ష కింద ముందే రిలీజ్ అవుతాడు. తనకు సహాయం చేసిన పోలీస్ అధికారి (గౌతమ్ వాసుదేవన్ మీనన్) దుండగుల దాడిలో చనిపోతాడు. దాంతో అతడి కూతురి విజ్జి పెంపకం బాధ్య వెట్రీపై పడుతుంది. కానీ చిన్నతనంలో ఓ సంఘటన కారణంగా విజ్జి ఓ మానసిక వ్యాధితో బాధపడుతుంటుంది. విజ్జిని ఆమె తండ్రి ఆర్మీ జవానుగా చూడాలనుకొంటాడు. దాంతో వెట్రీ తన పెంపుడు కూతురును ఆర్మీ జవాన్‌గా చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. అందుకు ఆమె తన అయిష్టతను వ్యక్తం చేస్తుంటుంది. ఈ క్రమంలో విజ్జిని అంతర్జాతీయ మాఫియా డాన్ జాన్ హిమ్లర్ (బాబీ డియోల్) ముఠా వెంటాడుతుంటుంది.

Advertisement

వెట్రీ జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తున్నాడు? జైలులో బిజినెస్ మ్యాన్‌ను చంపాలని దుండగులు ఎందుకు ప్రయత్నించారు? బిజినెస్ మ్యాన్‌ను వెంట్రీ ఎలా కాపాడాడు? పోలీస్ ఆఫీసర్‌ను ఎవరు? ఎందుకు చంపారు? విజ్జిని తన కూతురుగా వెట్రీ ఎలా పెంచాడు? వెట్రీపై విజ్జికి ఉన్న అసంతృప్తి ఏమిటి? వెట్రీకి తన ప్రియురాలు (పూజాహెగ్డే)కు మధ్య ప్రేమాయణం ఎలా సాగింది? జాన్ హిమ్లర్‌కు తమిళ రాజకీయ నేత రోజా రంగస్వామికి ఉన్న లింక్ ఏమిటి? జాన్ హిమర్‌కు ఐఏఎస్ అధికారి (ప్రియమణి)కి ఉన్న సంబంధం ఏమిటి? విజ్జికి ఉన్న మానసిక వ్యాధిని ఎలా నయం చేశాడు? వెట్రీ తన లక్ష్యాన్ని ఎలా చేరుకొన్నాడు? జాన్ హిమ్లర్‌ ఆట కట్టించాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

Advertisement

నేలకొండ భగవంత్ కేసరి ఆధారంగా రూపొందిన ఈ సినిమాను పూర్తిగా మార్చేశారు. విజయ్, మమితా బైజు మధ్య ఉంటే పాయింట్ తప్పా.. హెచ్ వినోద్ పూర్తిగా తన కథతో తెరకెక్కించారు. అయితే విజయ్ ఇమేజ్, పొలిటికల్ లక్ష్యాన్ని టార్గెట్ చేసుకొని ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా రూపొందించడమే కాకుండా దానికి దేశభక్తి అంశాన్ని జోడించారు. అయితే పొలిటికల్ డ్రామా, దేశభక్తి అంశాలు ప్రేక్షకులను మెప్పించలేకపోగా, ఆ ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టిందనే చెప్పాలి. సినిమా మొత్తంలోనే కథపరంగా, కథనం పరంగా, క్యారెక్టర్ల డిజైన్ పరంగా ఎక్కడా మెప్పించలేకపోవడం వల్ల ఈ సినిమా పూర్తిగా నాసిరకంగా, పేలవంగా కనిపిస్తుంది. విజయ్ చివరి సినిమా కావడంతో ఎక్కువగా ఆశించి వచ్చిన ఆడియెన్స్‌కు, అభిమానులకు పూర్తి నిరాశే అని చెప్పాలి.

Advertisement

కొన్ని గ్రామాల్లో ఓటు హక్కు బహిష్కరించడం అనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో దర్శకుడు సినిమాను ప్రారంభించాడు. కథలోకి వెళ్లిన కొద్ది అసలు విషయం పక్కన పెట్టి.. విజయ్ చుట్టు అల్లుకొన్న కథను కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించడం వల్ల టార్గెట్ మిస్ అయ్యాడనిపిస్తుంది. విజయ్ అభిమానులకు ఏం కావాలో అది ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించడం ఈ సినిమాపై భారీ దెబ్బ కొట్టింది. ఇంటర్నేషనల్ మాఫియా కుట్రలు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యత అనే పాయింట్ కథకు బలంగా మారకపోగా, సినిమాను అత్యంత బలహీనంగా మార్చింది. భగవంత్ కేసరి సినిమాతో పోల్చితే.. సెకండాఫ్ అంతా పూర్తిగా మార్చేసి కొత్తగా చెప్పడం వల్ల ఏ మాత్రం ఆకట్టుకోలేకపోగా.. అతుకుల బొంతగా మారిందనే ఫీలింగ్ కలుగుతుంది.

Advertisement

విజయ్ పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ గురించి కొత్తగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి క్యారెక్టర్‌లో కనిపించాడు. కాకపోతే రొటీన్‌గా, రెగ్యులర్‌గా క్యారెక్టర్ ఉండటం వల్ల అభిమానులకు పూర్తిగా నిరాశే ఉంటుంది. పూజా హెగ్డే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్ల గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేకపోయింది. మమితా బైజు రోల్ కూడా అంతా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, ఇతర పాత్రలు రొటీన్, రెగ్యులర్‌గానే ఉంటాయి.

ఇక ఈ సినిమా సాంకేతిక విభాగాల పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అనిరుధ్ పాటలు మినహాయిస్తే.. బలమైన కంటెంట్, సీన్లు లేకపోవడం వల్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా వర్కవుట్ కాలేదు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు కూడా అంతగా ఆకట్టుకొనే స్థాయిలో లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ పెట్టిన ఖర్చు తెర మీద కనిపించదు. ఓవరాల్‌గా యావరేజ్ అని కూడా గట్టిగా చెప్పుకోలేని పరిస్థితిగా సినిమా కనిపిస్తుంది. విజయ్ చివరి సినిమాను థియేటర్లలో చూడాలనుకొంటే.. జన నాయగన్ చూడాలి. అంతేగానీ.. ఈ సినిమా చూడాలి అనే దానికి ప్రత్యేకంగా కారణాలు ఏమి లేవనే చెప్పాలి. కంటెంట్, పెర్ఫార్మెన్స్, మేకింగ్ పరంగా చూస్తే.. భగవంత్ కేసరి సినిమా దారిదాపుల్లో కూడా ఈ సినిమా ఉండదు.