Jana Nayagan Public Talk: తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన భారీ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జన నాయగన్'. ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమితా బైజు కీలక పాత్ర పోషించారు. బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, సునీల్, రేవతి, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

Advertisement
Advertisement

హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్.కే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందించగా, ప్రదీప్ ఈ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. అయితే.. సెన్సార్‌కు సంబంధించిన పలు అడ్డంకులు రావడంతో దాదాపు ఏడు నెలల ఆలస్యమైంది. ఈ సినిమా గురువారం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. . ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది. ప్రేక్షకుల అభిప్రాయాలు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Advertisement


దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' జూలై 23న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. విడుదలైన తొలి షో నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపించింది. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ విజయ్ నటన, యాక్షన్ సన్నివేశాలు, పొలిటికల్ ఎలిమెంట్స్, అనిరుధ్ సంగీతంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు ఈ సినిమాను "వన్ మ్యాన్ షో"గా అభివర్ణిస్తున్నారు. ఒక అభిమాని మాట్లాడుతూ.. "సినిమా అదిరిపోయింది. సీఎం అయిన తర్వాత విజయ్ చేసిన బెస్ట్ మూవీ ఇది. ఫ్యాన్స్‌కు పూల్ మీల్స్ లాంటి సినిమా. పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, డ్యాన్స్, యాక్షన్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. 'భగవంత్ కేసరి' తరహాలో ఉంటుందని అనుకున్నా.. దానికంటే కొత్తగా అనిపించింది. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం ఖాయం" అని అభిప్రాయపడ్డాడు.
Advertisement

మరో ప్రేక్షకుడు మాట్లాడుతూ.. "నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా సినిమా ఉంది. విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి సీన్‌లో హైలైట్‌గా నిలిచింది. అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి"అని చెప్పాడు. ఇంకో అభిమాని సినిమా రాజకీయ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. "సినిమాలో విజయ్ ఎలా ప్రజల కోసం నిలబడతాడో.. నిజ జీవితంలో సీఎంగా కూడా అలాగే పనిచేస్తున్నారు. కొన్ని సన్నివేశాల్లో నిజంగానే గూస్‌బంప్స్ వచ్చాయి. 'భగవంత్ కేసరి' కంటే ఈ సినిమా మరింత బాగా అనిపించింది. పొలిటికల్ డైలాగ్స్ బాగా పేలాయి. అందుకే ఎన్నికల ముందు ఈ సినిమా రాలేదేమో అనిపించింది. ఇప్పుడు మాత్రం భారీ బౌన్స్‌బ్యాక్ ఇచ్చింది"అని వ్యాఖ్యానించాడు.

Advertisement

మరో అభిమాని మాట్లాడుతూ.. "విజయ్ సీఎం అయిన తర్వాత వచ్చిన తొలి సినిమా ఇదే. బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయం. ఇది రీమేక్ అనుకున్నాం.. కానీ పూర్తిగా కొత్త అనుభూతి ఇచ్చింది. క్లైమాక్స్ చివరి 15 నిమిషాలు ఊహించని ట్విస్టులతో అద్భుతంగా తీశారు. అదే సినిమాకు పెద్ద హైలైట్" అని చెప్పాడు. 'జన నాయకుడు' అనే టైటిల్‌కు విజయ్ పూర్తిగా న్యాయం చేశాడు. రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో కూడా అనిపించాడు. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్లు 'భగవంత్ కేసరి'ని గుర్తు చేసినా.. తర్వాత సినిమా పూర్తిగా తనదైన దారిలో వెళ్లింది. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి ఎలివేషన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది" అని అభిప్రాయపడ్డాడు.

Advertisement

మరికొందరూ అభిమానులు జననాయగన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా విజయ్ ఇంట్రడక్షన్ సీన్, 'దళపతి కచేరి పాట, ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్లలో అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించాయని చెబుతున్నారు. దర్శకుడు హెచ్. వినోద్ పనితీరుపైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 'భగవంత్ కేసరి'లోని కొన్ని కోర్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌ను మాత్రమే తీసుకుని, విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తిగా కొత్త కథను రూపొందించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విలన్ ట్రాక్, రాజకీయ నేపథ్యం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు.

సెకండ్ హాఫ్‌లో వచ్చే 45 నిమిషాల ఫ్లాష్‌బ్యాక్ సినిమాకు ప్రధాన బలమని ప్రేక్షకులు చెబుతున్నారు. రాజకీయ అంశాలతో నిండిన ఆ ఎపిసోడ్ విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఉండటంతో అభిమానులను బాగా ఆకట్టుకుందని అంటున్నారు. యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసినట్టు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా తొలి రోజు ప్రేక్షకుల స్పందనను బట్టి చూస్తే.. 'జన నాయగన్'కు మాస్ ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. అయితే సినిమా దీర్ఘకాల బాక్సాఫీస్ ప్రస్థానం ఎలా ఉంటుందో, ట్రేడ్ వర్గాల అంచనాలను అందుకుంటుందో లేదో రాబోయే రోజుల్లో తేలనుంది.